అక్షరటుడే, వెబ్‌డెస్క్: Irfan Pathan | పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2006లో పాకిస్థాన్ టూర్ సందర్భంగా అఫ్రిదితో జరిగిన ఒక సంఘటనను పఠాన్ ఇటీవల గుర్తు చేసుకుంటూ, తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇర్ఫాన్ పఠాన్ ‘లల్లన్‌టాప్’ యూట్యూబ్ ఛానల్‌కి (YouTube Channel) ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “2006 టూర్‌లో కరాచీ నుంచి లాహోర్‌కు ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నాం. రెండు జట్ల ఆటగాళ్లూ ఒకే విమానంలో ఉన్నారు. అఫ్రిదీ (Shahid Afridi) నా దగ్గరకు వచ్చి, నా తల మీద చేయి వేసి జుట్టు చెదరగొట్టాడు. ‘ఏరా అబ్బాయ్, ఎలా ఉన్నావ్?’ అని అన్నాడు. అతను నా తండ్రి ఎప్పుడు అయ్యాడు అని నేను మనసులో అనుకున్నా. ఆ సమయంలో ఆఫ్రిది చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు” అని చెప్పారు.
Irfan Pathan | షాహిద్‌కి కౌంటర్..
అఫ్రిది ప్రవర్తనపై కోపంతో ఉన్న పఠాన్ (Irfan Pathan), పక్కనే ఉన్న పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను ఒక ప్రశ్న అడిగాడు. ఈ ప్రాంతంలో ఏ మాంసం దొరుకుతుంది? అని అడగ్గా, దానికి రజాక్ వివిధ మాంసాల జాబితా చెబుతుంటే, పఠాన్.. కుక్క మాంసం దొరుకుతుందా? అని అడిగాడు. దానికి రజాక్ ఆశ్చర్యపోతూ.. “ఏంటి ఇర్ఫాన్, అలా అంటున్నావ్?” అని ప్రశ్నించగా.. దానికి ఇర్ఫాన్ పఠాన్ సమాధానం ఇస్తూ.. అఫ్రిది కుక్క మాంసం తిన్నాడు అనుకుంటా. అందుకే చాలా సేపటి నుంచి మొరుగుతున్నాడు! అని అన్నాడట. అది విన్న షాహిద్ అఫ్రిది సైలెంట్ అయ్యాడని పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత అతను ఏం మాట్లాడినా.. ‘ఇదిగో, మళ్లీ మొరుగుతున్నాడు’ అని అనేవాడిని. అందుకే ఆ ఫ్లైట్‌లో అతను పూర్తిగా సైలెంట్‌గా ఉన్నాడు. నాతో వాదిస్తే ఓడిపోతానని అతనికి అర్థమైంది. అందుకే ఇంకెప్పుడూ మాట్లాడలేదు” అని చెప్పాడు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ఇర్ఫాన్ భాయ్, మీరు చెప్పింది అక్షరాలా నిజం. అఫ్రిది ఎప్పుడూ ఇతరుల మతం, కుటుంబంపై వ్యక్తిగత దాడులు చేస్తూనే ఉంటాడు అంటూ పఠాన్‌కు మద్దతుగా నిలిచారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పఠాన్ – అఫ్రిదీ మధ్య ఉన్న గొడవలు, పాత ముచ్చట్లు మరోసారి చర్చకు తెరలేపాయి.