- Advertisement -
HomeతెలంగాణGroom | హత్యకు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి కొడుకు సూసైడ్​

Groom | హత్యకు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని పెళ్లి కొడుకు సూసైడ్​

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Groom : సికింద్రాబాద్​ వారాసిగూడ పీఎస్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కుదిరిన సంబరం క్షణమైనా లేకుండా పోయింది. దోస్తుల పార్టీలో జరిగిన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని, భయపడి పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బౌద్ధ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మోహన్ కృష్ణకు ఇటీవల పెళ్లి కుదిరింది. మే 4న నిశ్చితార్థం ఉంది. ఈ క్రమంలో ఈనెల 27న రాత్రి తన స్నేహితుడు శ్యాంసన్ రాజు, మరికొందరితో కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో శ్యాంసన్ రాజుతో కృష్ణ బావ లూథరస్ మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో శ్యాంసన్ రాజు తలపై లూథరస్ ఇనుప రాడ్డుతో కొట్టాడు. దీంతో శ్యాంసన్ రాజు అక్కడిక్కడే మృతి చెందాడు.

- Advertisement -

మిత్రుడి హత్యను ప్రత్యక్షంగా చూసిన మోహన్ కృష్ణ భయపడిపోయాడు. పెళ్లి జరగాల్సిన సమయంలో ఠాణాలు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో కృష్ణ ఉరేసుకొని సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసులు మొదట పార్శిగుట్టలో జరిగిన శ్యాంసన్ హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ వెంటనే మోహన్ కృష్ణ ఆత్మహత్య చేసుకోవడంతో అసలు విషయం బయటకి వచ్చింది.

 

- Advertisement -
- Advertisement -
Must Read
Related News