ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిElectric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. విగ్రహానికి కరెంట్​ వైర్లు తగలడంతో విద్యుత్​ షాక్​తో (electric shock) ఒకరు మృతి చెందారు. ఈ ఘటన పాల్వంచ మండలం (Palvancha mandal) ఆరేపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

    వినాయక చవితి ఉత్సవాలకు (Vinayaka Chavithi festival) యువత సిద్ధం అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో పండుగ ఉండటంతో విగ్రహాలను తీసుకెళ్తున్నారు. మండపాలను సిద్ధం చేసి ప్రతిమలను కూర్చోబెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భారీ వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్న క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. సిరిసిల్లకు (Siricilla) చెందిన 15 మంది యువకులు ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్​లో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి ట్రాక్టర్​లో తీసుకెళ్తుండగా.. పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో గల కస్తూర్బా పాఠశాల సమీపంలో ట్రాక్టర్​లో ఉన్న ఇద్దరికి విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోయారు. వెంటనే వారిని కామారెడ్డి జీజీహెచ్​కు (Kamareddy GGH) తరలించగా సిరిసిల్ల గోపాల్ నగర్​కు చెందిన లక్ష్మీనారాయణ (19) మృతి చెందాడు. సుభాష్ నగర్​కు చెందిన సాయికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Electric shock | జాగ్రత్తలు అవసరం

    హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) సైతం వినాయక విగ్రహాలను తీసుకెళ్తుండగా విద్యుత్​ షాక్​ తగిలి ముగ్గురు మృతి చెందారు. బండ్లగూడలో ఇద్దరు, అంబర్‌పేట్‌లో ఒకరు చనిపోయారు. వినాయక చవితికి యువత ఎంతో సందడి చేస్తారు. పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుంటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. విగ్రహం తీసుకు వెళ్లే మార్గంలో అడ్డుగా విద్యుత్​ వైర్లు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

    Latest articles

    Nizamsagar Project | నిజాంసాగర్​ను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తున్నాం..

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా (Tourism spot) అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్​...

    Dhurandhar Movie | స్టార్ హీరో మూవీ షూటింగ్‌లో ఫుడ్ పాయిజ‌న్.. 120 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhurandhar Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన...

    Indiramma Housing Scheme | ప్రారంభోత్సవాలకు ముస్తాబైన ఇందిరమ్మ ఇళ్లు.. పరిశీలించిన కలెక్టర్

    అక్షరటుడే, బోధన్: Indiramma Housing Scheme | జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లల్లో పురోగతి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల...

    Bodhan | బ్యాక్​వాటర్​ను పరిశీలించిన అదనపు కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు...

    More like this