ePaper
More
    HomeతెలంగాణKTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    KTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | హైదరాబాద్​(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా స్పందించారు. వారం రోజుల్లో నగరంలో రెండు షాకింగ్​ ఘటనలు జరిగాయన్నారు.

    నగరంలోని చందానగర్​లో ఇటీవల ఖజానా జ్యువెల్లరీ షోరూం(Khajana Jewellery Showroom)లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దుకాణం తెరిచిన ఐదు నిమిషాలకు ఆరుగురు దొంగలు తుపాకులతో లోనికి చొరబడి దోపిడీ చేశారు. వెండి, బంగారు ఆభరణాలతో పారిపోయారు. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అలాగే కూకట్​పల్లిలో ఇటీవల 12 ఏళ్ల బాలిక హత్య జరిగింది. ఈ ఘటనలపై కేటీఆర్(KTR)​ స్పందించారు.

    KTR | వారం రోజుల్లో రెండు ఘటనలు

    నగరంలో వారం రోజుల వ్యవధిలో రెండు ఘటనలు చోటు చేసుకోవడంపై కేటీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. జ్యువెలరీ షాపులో గన్‌తో బెదిరించి దోపిడీ చేశారన్నారు. ఉదయం పూట గన్​లతో బెదిరించి దోపిడీకి పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలతో నగర ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    KTR | ప్రజల భద్రతకు ముప్పు

    కాంగ్రెస్‌ పాలనలో ప్రజల భద్రతకు ముప్పు ఉందని కేటీఆర్​ విమర్​శించారు. శాంతిభద్రతలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆయన ఆరోపించారు. పౌరులకు భద్రత కావాలి.. భయం కాదని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులను కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచాలని ఆయన డిమాండ్​ చేశారు.

    Latest articles

    Nizamsagar Project | నిజాంసాగర్​ను టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేస్తున్నాం..

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్​ ప్రాజెక్టును టూరిజం స్పాట్​గా (Tourism spot) అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్​...

    Dhurandhar Movie | స్టార్ హీరో మూవీ షూటింగ్‌లో ఫుడ్ పాయిజ‌న్.. 120 మందికి పైగా తీవ్ర అస్వ‌స్థ‌త‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhurandhar Movie | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన...

    Indiramma Housing Scheme | ప్రారంభోత్సవాలకు ముస్తాబైన ఇందిరమ్మ ఇళ్లు.. పరిశీలించిన కలెక్టర్

    అక్షరటుడే, బోధన్: Indiramma Housing Scheme | జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లల్లో పురోగతి కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల...

    Bodhan | బ్యాక్​వాటర్​ను పరిశీలించిన అదనపు కలెక్టర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు...

    More like this