- Advertisement -
HomeతెలంగాణCI transfers | ఒకేసారి 146 సీఐల బదిలీ.. పలు ఠాణాల పేర్ల మార్పు

CI transfers | ఒకేసారి 146 సీఐల బదిలీ.. పలు ఠాణాల పేర్ల మార్పు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: CI transfers : హైదరాబాద్​ మహానగరంలోని పలు ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఠాణాలు, డివిజన్ల పేర్లు మార్చుతున్నట్లు హైదరాబాద్​ కమిషనర్​ సీవీ ఆనంద్ police commissioner CV anand​ తెలిపారు. 72వ లా అండ్​ ఆర్డర్​ పోలీస్​ స్టేషన్​గా టోలిచౌకి ఏర్పాటు చేశామన్నారు. సెక్రటేరియట్​ ఠాణాను లేక్​ పోలీస్​ స్టేషన్​గా, హుమాయున్​ నగర్​ పీఎస్​ను మెహదీపట్నం ఠాణాగా, షాహినాయత్​గంజ్​ పీఎస్​ను గోషామహల్​ పోలీస్​ స్టేషన్​గా మార్చినట్లు కమిషనర్​ వెల్లడించారు.

హైదరాబాద్​ కమిషనరేట్​లో 35 ఏళ్ల తర్వాత పోలీస్​ స్టేషన్ల పునర్ ​వ్యవస్థీకరణ చేపట్టారు. నగరంలో 71 లా అండ్​ ఆర్డర్​, 31 ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్లు ఉన్నాయి. కాగా, పోలీస్​స్టేషన్ల హద్దుల్లో గత రెండేళ్లుగా సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. ట్రాఫిక్​, లా అండ్​ ఆర్డర్​ ఠాణాలపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక పంపగా, మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్​ సిటీ పోలీస్​ వెబ్​సైట్​లో పోలీస్​స్టేషన్ల వివరాలను పొందుపర్చుతామని సీపీ సీవీ ఆనంద్​ తెలిపారు.

- Advertisement -

మరోవైపు హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఒకేసారి పెద్ద ఎత్తున సీఐలను బదిలీ ci transfers చేశారు. హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో 146 మంది సీఐలను బదిలీ చేశారు. ఈమేరకు సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News