అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Sipligunj | తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాహుల్ సిప్లిగంజ్. ఫోక్ పాటలతో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలంగాణ యువ గాయకుడు, బిగ్ బాస్ విన్నర్‌గా తన సత్తా చాటాడు. అంతే కాదు, ఆర్ఆర్ఆర్ RRR చిత్రంలోని నాటు నాటు పాటకు గాయకుడిగా ఆస్కార్ అవార్డు అందుకొని పాన్ ఇండియా స్థాయి(Pan India Level)లో కూడా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం నటుడిగా, గాయకుడిగా బిజీగా ఉన్న రాహుల్, ఆగస్టు 17న సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వార్త వెలుగులోకి రావడంతో, “రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు?” అనే చర్చ నెట్టింట వైరల్ అవుతోంది.
Rahul Sipligunj | బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
రాహుల్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి. ఆమె, టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె. రాహుల్, హరిణి రెడ్డి (Harini Reddy) మధ్య పరిచయం 2020లో ప్రారంభమైంది. అప్పటి నుంచి గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హరిణ్య, బిగ్ బాస్ షో నిర్వహించే ఎండెమాల్ షైన్ కంపెనీలో ప్రొడ్యూసర్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు అనే సమాచారం వినిపిస్తోంది.అంతేగాక, హరిణ్య కుటుంబం నందమూరి బాలకృష్ణ కుటుంబానికి సన్నిహితులు అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఈ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ITC కోహినూర్ హోటల్(ITC Kohinoor Hotel)లో అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ఆస్కార్ అవార్డు పొందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)తో మా అన్న కూతురు హరిణి రెడ్డి నిశ్చితార్థం జరగడం సంతోషంగా ఉంది” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత రాహుల్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “రాహుల్ మంచి కుటుంబంలోకి అల్లుడిగా వెళ్తున్నాడు” అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో నిశ్చితార్థ ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక రాహుల్- హరిణ్యల పెళ్లి ఎప్పుడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.