ePaper
More
    Homeబిజినెస్​Mukesh Ambani | కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ముఖేష్ అంబానీ.. ఏకంగా ఆ కంపెనీతో ఒప్పందం

    Mukesh Ambani | కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ముఖేష్ అంబానీ.. ఏకంగా ఆ కంపెనీతో ఒప్పందం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mukesh Ambani | ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన FMCG విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), తాజాగా కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయుర్వేద ఆధారిత పానీయాలు తయారు చేసే కంపెనీ నేచర్స్ ఎడ్జ్ బేవరేజెస్లో భారీ వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో రిలయన్స్‌ ఇప్పుడు వేగంగా పెరుగుతున్న హెల్త్ అండ్ వెల్నెస్ డ్రింక్స్(Health and Wellness Drinks) మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టిన‌ట్టైంది. అంటే అంబానీ ఇప్పటి నుంచి మూలికలతో తయారైన ఆరోగ్యపానీయాలను విక్రయించనున్నాడు. RCPL ప్రకారం, ఈ భాగస్వామ్యం కంపెనీని పూర్తి స్థాయి బేవరేజెస్ బ్రాండ్‌(Beverages Brand)గా మార్చ‌నుంది.

    Mukesh Ambani | స‌రికొత్త నిర్ణ‌యం..

    నేచర్స్ ఎడ్జ్(Natures Edge) అనేది ఫంక్షనల్ డ్రింక్స్ తయారీలో ప్రత్యేకత కలిగిన కంపెనీ. ఇవి శక్తి, ఫోకస్, జీర్ణక్రియ వంటి అంశాలను మెరుగుపరిచేలా తయారు చేయబడతాయి. ఇప్పటికే రిలయన్స్ పానీయాల విభాగంలో కాంపా (కార్బొనేటెడ్ డ్రింక్), సోషియో సాఫ్ట్ డ్రింక్స్, స్పిన్నర్ (స్పోర్ట్స్ డ్రింక్), రస్కీక్ (పండ్ల ఆధారిత పానీయం), వంటి బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు నేచర్స్ ఎడ్జ్ లాంటి ఆయుర్వేద హెల్త్ డ్రింక్స్(Ayurvedic Health Drinks) కంపెనీతో భాగస్వామ్యం ద్వారా, RCPL పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం కానుంది. 2018లో ప్రారంభమైన నేచర్స్ ఎడ్జ్ బేవరేజెస్, బైద్యనాథ్ గ్రూప్‌కు చెందిన మూడవ తరం వ్యవస్థాపకుడు సిద్ధేష్ శర్మ(Founder Siddhesh Sharma) స్థాపించిన కంపెనీ. దీని లక్ష్యం భారతీయ ఆయుర్వేదాన్ని ఆధునిక పానీయాల రూపంలో అందించడం.

    చక్కెర లేదా అధిక కేలరీస్ లేని ఈ డ్రింక్స్‌లో అశ్వగంధ(Ashwagandha), బ్రహ్మి(Brahmi), ఖుస్(Khus), కోకుమ్, గ్రీన్ టీ(Green Tea) వంటి మూలికలు వాడతారు. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చేలా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడేలా ఉంటాయి. వెల్నెస్ పానీయాల రంగం రాబోయే సంవత్సరాల్లో భారీగా వృద్ధి చెందుతుందని నిపుణుల అభిప్రాయం. అలాంటి సమయంలో అంబానీ(Mukesh Ambani)తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం, రిలయన్స్‌కు గేమ్ ఛేంజర్ కావచ్చు. మొత్తంగా చూస్తే, రిలయన్స్ తీసుకున్న తాజా నిర్ణ‌యం FMCG రంగంలో అనేక అవకాశాలను అందంచేలా క‌నిపిస్తుంది. మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీలకు దీన్ని ఒక బలమైన పోటీగా చూడాల్సి వస్తుంది.

    Latest articles

    CM Revanth Reddy | తెలంగాణ‌పై ప్ర‌ధానికి వివక్ష‌.. యూరియా ఇవ్వ‌డం లేద‌ని సీఎం రేవంత్ ఫైర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణ రాష్ట్రంపై...

    Toll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Pass | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక టోల్​పాస్లను (Toll Pass)​ అమలులోకి తెచ్చిన విషయం...

    LIC Jobs | ఎల్‌ఐసీలో ఏఏవో, ఏఈ పోస్టులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC Jobs | పలు పోస్టుల భర్తీ కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా...

    Vice President candidate | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి.. ప్రకటించిన ఇండి కూటమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President candidate | విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణకు...

    More like this

    CM Revanth Reddy | తెలంగాణ‌పై ప్ర‌ధానికి వివక్ష‌.. యూరియా ఇవ్వ‌డం లేద‌ని సీఎం రేవంత్ ఫైర్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణ రాష్ట్రంపై...

    Toll Pass | నాలుగు రోజుల్లో 5 లక్షల టోల్​పాస్​లు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Pass | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక టోల్​పాస్లను (Toll Pass)​ అమలులోకి తెచ్చిన విషయం...

    LIC Jobs | ఎల్‌ఐసీలో ఏఏవో, ఏఈ పోస్టులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC Jobs | పలు పోస్టుల భర్తీ కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా...