అక్షరటుడే, వెబ్‌డెస్క్: professional game Cricket : క్రికెట్ Cricket అనేది ప్రొఫెషనల్ గేమ్‌గా మారింది. చిన్న పిల్లాడి నుండి ఐదు పదుల వయస్సు ఉన్న వారు కూడా క్రికెట్‌ని ఎంతో ఇష్టపడుతున్నారు.
ఈ గేమ్ లో ఉండే ట్విస్ట్‌లు ప్రేక్షకులకు మాంచి కిక్ ఇస్తుంటాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న స్థానిక టోర్నమెంట్‌లలో, ప్రొఫెషనల్ స్థాయిలో కూడా కనిపించని అద్భుత ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (social media) విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఓ స్థానిక క్రికెట్ మ్యాచ్ లో అంచనాలు తలకిందులయ్యేలా ఈ ఘటన చోటుచేసుకుంది.
professional game Cricket : గెలిచే మ్యాచ్‌లో ఓడారు..
చివరి బంతికి గెలవాలంటే బ్యాటింగ్ Batting జట్టుకు రెండు పరుగులు కావాలి. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. బౌలర్ బంతిని వేయగా, బ్యాటర్ చక్కగా కట్ షాట్ ఆడి పరుగుకు వెళ్లాడు. అయితే తొలి రన్ అయితే సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాడు.
బంతి ఫీల్డర్ సమీపంలో ఉన్నా కూడా రెండో పరుగుకు ప్రయత్నించారు. అప్పుడు ఫీల్డర్ బంతిని అందుకుని వెంటనే నాన్-స్ట్రైకర్ ఎండ్‌కి విసిరాడు.
అక్కడే బౌలర్‌తో పాటు మరో ఫీల్డర్ బంతి కోసం వేచి చూస్తూ దానిని పట్టుకోకుండా వదిలేశారు. ఇద్దరూ బంతి నేరుగా స్టంప్స్‌ను తాకుతుందని భావించి దాన్ని పట్టకుండానే వదిలేశారు.
అయితే బంతి స్టంప్స్‌ను తాకకుండా వెళ్లిపోవడంతో, బ్యాటర్లు రెండో రన్‌ను కూడా పూర్తి చేసి మ్యాచ్ గెలిచేశారు.
దీంతో బ్యాటింగ్ Batting జట్టు ఉత్సాహంగా జంప్‌లు వేస్తుంటే.. ఫీల్డింగ్ జట్టు మాత్రం నిరాశతో ఒకరిపై ఒకరు విసుక్కుంటూ కనిపించారు.
professional game Cricket : వీడియో వైరల్
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
“ఇదేం ఫీల్డింగ్ రా బాబు!”, “అంత కష్టపడి బౌలింగ్ చేసి ఇలా చేజారిపోతే, మాములు కోపం రాదు”, “ఇదేమి క్రికెట్ రా నాయనా!” అంటూ నెటిజన్లు(Netizens) విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
వీడియోకు వేల కొద్దీ లైక్‌లు, షేర్లు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్(international cricket)లో కూడా ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం.
2 runs needed in 1 ball, and then the bowler and one of the fielders did this 😂
– A Rare Video, You Must Watch it 😅 pic.twitter.com/wDrDIhWidr
— Richard Kettleborough (@RichKettle07) August 18, 2025