ePaper
More
    Homeబిజినెస్​Market Analysis on August 19 | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న...

    Market Analysis on August 19 | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Market Analysis on August 19 : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని(Russia, Ukraine war) ఆపడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యూరోపియన్‌ నాయకుల(European Leaders) తో సమావేశం అవుతున్నారు.

    పుతిన్‌, జెలెన్స్కీ ముఖాముఖి సమావేశం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ఫలితం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నందున గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.

    గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది.

    Market Analysis on August 19 : యూఎస్‌ మార్కెట్లు (US markets)..

    గత ట్రేడింగ్ సెషన్‌ నాస్‌డాక్‌(Nasdaq) 0.03 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ 0.01 శాతం నష్టపోయింది. ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.02 శాతం నష్టంతో సాగుతోంది.

    Market Analysis on August 19 యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.21శాతం పెరగ్గా.. సీఏసీ 0.50 శాతం, డీఏఎక్స్‌ 0.18 శాతం నష్టపోయాయి.

    ఆసియా మార్కెట్లు(Asian markets)..

    మంగళవారం ఉదయం 8.10 గంటల సమయంలో స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.26 శాతం, షాంఘై(Shanghai) 0.18 శాతం లాభంతో ఉన్నాయి.

    కోస్పీ 0.50 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.42 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.19 శాతం, నిక్కీ 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

    గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Market Analysis on August 19 : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నాలుగో రోజుల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. నికరంగా రూ. 550 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు.
    • డీఐఐలు 30వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 4,103 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.01 నుంచి 1 కి తగ్గింది. విక్స్‌(VIX) 0.12 శాతం తగ్గి 12.34కు చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.49 శాతం పెరిగి 66.27 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 21 పైసలు బలపడి 87.35 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.34 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.19 వద్ద కొనసాగుతున్నాయి.

    జులైలో అంతకుముందు నెలతో పోల్చితే నిరుద్యోగిత రేటు తగ్గింది. 18 ఏళ్లు ఆపై వయసువారిలో నిరుద్యోగిత రేటు 5.6 శాతంనుంచి 5.2 శాతానికి తగ్గింది.

    గ్రామీణ ప్రాంతాలలో మెరుగుదల కనిపించింది. ఇక్కడ నిరుద్యోగిత రేటు 4.9 శాతంనుంచి 4.4 శాతానికి తగ్గడం గమనార్హం.

    పట్టణ ప్రాంతంలో ఇది 7.2 శాతనుంచి 7.1 శాతానికి తగ్గిందని తాజా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(PLFS) తెలిపింది.

    Latest articles

    Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి.. ప్రకటించిన ఇండి కూటమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణకు చెందిన...

    Vinayaka Chavithi | వినాయక మండళ్లు నిబంధనలు పాటించాలి

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | నగరంలో వినాయక మండళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ...

    Irfan Pathan | షాహిద్ అఫ్రిదిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్ .. కుక్క మాంసం తిన్నాడు కాబ‌ట్టే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Irfan Pathan | పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పై భారత మాజీ...

    Nandamuri Jayakrishna | సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. నంద‌మూరి జ‌య‌కృష్ణ స‌తీమ‌ణి ఇక లేరు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nandamuri Jayakrishna | ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌ని వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. నెల క్రితం...

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి.. ప్రకటించిన ఇండి కూటమి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణకు చెందిన...

    Vinayaka Chavithi | వినాయక మండళ్లు నిబంధనలు పాటించాలి

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | నగరంలో వినాయక మండళ్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని పట్టణ సీఐ...

    Irfan Pathan | షాహిద్ అఫ్రిదిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్ .. కుక్క మాంసం తిన్నాడు కాబ‌ట్టే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Irfan Pathan | పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పై భారత మాజీ...