అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold price on August 19 : ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు Gold Prices స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, బంగారం ధరలు ఇప్పటికీ లక్ష రూపాయల మార్కు పైగానే ట్రేడవుతున్నాయి.
ఆల్ టైం రికార్డ్ స్థాయితో పోల్చితే బంగారం ధరలు కొంత తగ్గినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పసిడి ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, అమెరికాలో వాణిజ్య యుద్ధాలు trade wars, స్టాక్ మార్కెట్ల అనిశ్చితి మొదలైన అంశాలని చెబుతున్నారు.
ఆగస్టు 19వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,01,170గా ట్రేడ్ అవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..
- చెన్నై(CHENNAI)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 గా ట్రేడ్ అయింది.
- హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా ట్రేడ్ అయింది.
- విజయవాడ(VIJAYAWADA)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీ(DELHI)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,320గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,890గా ట్రేడ్ అయింది.
- వాణిజ్య రాజధాని ముంబయి(MUMBAI)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170గా ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా కొనసాగుతోంది.
- కోల్‌కతా(KOLKATA)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 గా ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా కొనసాగుతోంది.
బంగారం ధర కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నా.. వెండి Silver Price మాత్రం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో ధర రూ.1,17,100గా ట్రేడ్ అయింది.
ఇక బంగారం విషయంలో ఇంకా ధరలు తగ్గే అవకాశముందా.. లేదా.. అనేదానిపై మార్కెట్‌లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. కాగా.. పండుగల సీజన్ సమీపిస్తుండటంతో, బంగారానికి మళ్లీ డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.