ePaper
More
    HomeజాతీయంGST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి...

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. దీపావళి పండుగ నాటికల్లా ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    కేంద్ర ప్రభుత్వం (central government) కొత్త తరం GST సంస్కరణలు తీసుకురాబోతోంది. ఇవి అమల్లోకి వస్తే.. GST శ్లాబులు సరళీకృతం కానున్నాయి. తద్వారా ఆయా వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. అలా ప్యాసింజర్​ వాహనాల ధరలు తగ్గనున్నాయి.

    సామాన్యులకు ఉపయోగపడే వాహనాల అమ్మకాలను పెంచడమే కొత్త తరం జీఎస్టీ సంస్కరణల లక్ష్యం. ప్రధాని మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో GST సంస్కరణలను ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    GST reforms : నాలుగుకి బదులుగా రెండు జీఎస్టీ స్లాబ్‌లు..

    ప్రస్తుతం భారత్​లో వస్తువులు, సేవలపై నాలుగు రకాల పన్ను స్లాబ్​లు(GST slabs) (tax slabs) ఉన్నాయి. 5%, 12%, 18%, 28% గా పన్ను వసూలు చేపడుతున్నారు.

    కొత్త సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు రకాల స్లాబ్​లను మాత్రమే అమలు చేయాలని యోచిస్తోంది. స్టాండర్డ్(standard), క్వాలిఫైడ్(qualified) స్లాబ్​లను మాత్రమే తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే వీటి కింద 5, 18 శాతం పన్ను స్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయని చెబుతున్నారు.

    ప్రస్తుతం 28 శాతం పన్ను స్లాబ్‌లో కార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కొత్త సంస్కరణలు అమల్లోకి వస్తే ఈ వాహనాలను 18 శాతం పన్ను స్లాబ్‌లోకి మార్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అంటే ఈ విధంగా అమల్లోకి తెస్తే.. దాదాపు 10 శాతం భారం తగ్గుతుంది.

    ఇలా చేయడం వల్ల కొత్తగా వాహనాల కొనుగోలును ప్రోత్సహించినట్లు అవుతుంది. తద్వారా ఆటోమొబైల్ రంగాని(automobile sector)కి ఊతం లభిస్తుంది. వాహనాల ధరల తగ్గుదలతో మధ్యతరగతి వారిని కొనుగోలుకు ప్రోత్సహించినట్లు అవుతుందని భావిస్తున్నారు.

    GST reforms : విడి భాగాలపైనా..

    ఆటోమొబైల్ విడి భాగాలపైనా పన్ను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా వాహనాల తయారీ ఖర్చు కూడా తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.

    ఎలక్ట్రిక్​ వాహనాల పరిస్థితి..

    ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం 5% పన్ను శ్లాబ్ ఉంది. గ్రీన్ ఎనర్జీని సర్కారు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ పన్నును పెంచే అవకాశం లేదని తెలుస్తోంది.

    ఇక లగ్జరీ కార్ల విషయంలో పాత పన్ను శ్లాబే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల వాహనాలపై ప్రస్తుతం ఉన్న రిలీఫ్ సెస్​ అలాగే కొనసాగిస్తారని భావిస్తున్నారు. కాగా.. విలాసవంతమైన, పొగాకు వంటివాటిపై 40 శాతం పన్ను విధించాలనే సిఫార్సు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

    ప్రధాన లక్ష్యం ఏమిటంటే..

    కొత్తగా చేపట్టే GST సంస్కరణల ప్రధాన లక్ష్యం కేవలం వాహనాల ధరలను తగ్గించడం మాత్రమే కాదంటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపారం సులభతరం చేస్తూ ప్రోత్సహించడంగా చెబుతున్నారు. అమెరికా అధిక సుంకాల (US tariffs) నేపథ్యంలో మన ఆర్థిక (economy) వ్యవస్థకు ఊతం ఇచ్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు ఉంటాయని పేర్కొంటున్నారు.

    ఇంకా ఏమి తగ్గనున్నాయంటే..

    కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు గృహోపకరణాల ధరలు తగ్గనున్నాయని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.

    ఈ సిఫార్సులను త్వరలో GST కౌన్సిల్(GST Council) చర్చించనుందని అంటున్నారు. ఆ తర్వాత అమల్లోకి తీసుకురానున్నారు. అనుకున్న విధంగా అన్నీ సక్రమంగా జరిగితే అక్టోబరు, నవంబరు నాటికి అంటే అటు ఇటుగా దీపావళి(Diwali) నాటికి ప్రజలకు ఫలాలు చేరనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సంస్కరణల పూర్తి ప్రయోజనాలు ప్రజలకు చేరే అవకాశం ఉంది.

    Latest articles

    Union Cabinet | ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు క్యాబినేట్‌ ఆమోదం.. తేడా వ‌స్తే క‌ఠిన శిక్ష‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. లగేజీ బరువు పరిమితి దాటితే ఫైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | దేశంలో నిత్య కోట్లాది మంది ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తారు....

    Food Tips | జ్వరం నుంచి కోలుకోవడానికి, ప్లేట్‌లెట్స్ పెంచుకోవడానికి.. ఈ ఫుడ్ తప్పనిసరి

    అక్షరటుడే, హైదరాబాద్: Food Tips | సాధారణ జ్వరం అయినా, డెంగ్యూ (dengue) dengueవంటి తీవ్రమైన జ్వరాల తర్వాత...

    Nizamabad | జల్సాలకు అలవాటు పడి చోరీలు.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు...

    More like this

    Union Cabinet | ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు క్యాబినేట్‌ ఆమోదం.. తేడా వ‌స్తే క‌ఠిన శిక్ష‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన సమావేశమైన...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. లగేజీ బరువు పరిమితి దాటితే ఫైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | దేశంలో నిత్య కోట్లాది మంది ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తారు....

    Food Tips | జ్వరం నుంచి కోలుకోవడానికి, ప్లేట్‌లెట్స్ పెంచుకోవడానికి.. ఈ ఫుడ్ తప్పనిసరి

    అక్షరటుడే, హైదరాబాద్: Food Tips | సాధారణ జ్వరం అయినా, డెంగ్యూ (dengue) dengueవంటి తీవ్రమైన జ్వరాల తర్వాత...