అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎక్పైజ్ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)లో ఆబ్కారీశాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ (Excise Commissioner Nishanth Kumar) మాట్లాడారు.
కొత్త బార్ పాలసీపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లు ఉన్నాయి.
కొత్త బార్ పాలసీలో భాగంగా వీటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు కమిషనర్ తెలిపారు. కొత్త వారు కూడా మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టేలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.
గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే మొదట రెస్టారెంట్ లైసెన్స్ ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనను సడలించారు. రెస్టారెంట్(restaurant) ఏర్పాటుకు పదిహేను రోజుల సమయం సరిపోతుందని, అంతలోనే ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు.
New Bar Policy | లైసెన్స్ ఫీజుల తగ్గింపు..
ఆంధ్రప్రదేశ్‌లో లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గించారు. ఈమేరకు 50 వేల లోపు జనాభా (population) ఉంటే రూ. 35 లక్షలు, 50 వేలు – 5 లక్షల జనాభాకు రూ. 55 లక్షలు, 5 లక్షలపైన అయితే రూ. 75 లక్షల లైసెన్స్ ఫీజు (License fees) ఉంటుందని కమిషనర్ వివరించారు.
ఏటా పది శాతం చొప్పున ఫీజులు పెంచనున్నట్లు కమిషనర్ తెలిపారు. గతంలో ఆగస్టులోపు ఒకేసారి లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేది.. కొత్త నిబంధనల ప్రకారం ఆరు సార్లు చెల్లించవచ్చని చెప్పారు.
ఏపీలో గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉండేవి.. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని కమిషనర్ తెలిపారు.
New Bar Policy | సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి..
బార్ల కోసం అన్ని కేటగిరీల్లో దరఖాస్తు ఫీజు రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. అర్హులైనవారు ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్ తెలిపారు.
28వ తేదీన కలెక్టర్ లాటరీ ద్వారా బార్లు కేటాయిస్తారన్నారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు.