అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(US President Trump)తో భేటీ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) తన స్నేహితులతో మాట్లాడారు. సోమవారం (ఆగస్టు 18) భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Indian Prime Minister Narendra Modi)కి ఫోన్ చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం అలస్కా(Alaska)లో ట్రంప్‌తో జరిగిన సమావేశంలో చర్చించిన విషయాలను మోడీకి పుతిన్ వివరించారు. నేడు రాత్రి జెలెన్స్కీతో కలిసి యూరోపియన్ నాయకులు వాషింగ్టన్(Washington)లో ట్రంప్‌ను కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి పుతిన్ కాల్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ మేరకు పుతిన్ కాల్ చేయడం, అలస్కా (Alaska) సమావేశంలో ట్రంప్‌తో జరిగిన చర్చలను పంచుకోవడం తదితర వివరాలను ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా తన స్నేహితుడైన పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్రెయిన్ వివాదంలో శాంతియుత పరిష్కారాన్ని భారత్ కోరింది. ఈ విషయంలో చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని మోడీ పునరుద్ఘాటించారు.
Putin calls Modi : పుతిన్ ఎందుకు ఫోన్ చేశారంటే..
జెలెన్స్కీ(Zelensky)తో కలిసి యూరోపియన్ నాయకులు (European leaders) ఈ రాత్రి వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవబోతున్నారు. భారత్ – రష్యా స్నేహ బంధం, వాణిజ్య సహకారం నేపథ్యంలో.. ఇటీవల భారతదేశంపై యూఎస్ భారీ సుంకాలు విధించింది.
రష్యా, ఉక్రెయిన్(Ukraine) ల మధ్య శాంతి నెలకొంటే.. భారత్‌పై విధించిన యూఎస్ సుంకాలకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రష్యాకు భారత్ అతి పెద్ద భాగస్వామిగా ఉంది. రష్యాకు భారత్ మంచి మిత్రదేశం కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో జెలెన్స్కీ, యూరోపియన్ నాయకుల భేటీ తర్వాత తీసుకునే నిర్ణయాల వల్ల రష్యాతో పాటు భారత్‌పైనా ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు.