ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిurea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కామారెడ్డి (Kamareddy) జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు.

    రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలోని మన గ్రోమోర్ ఫెర్టిలైజర్ (Fertilizer) షాపును సోమవారం ఆయన వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    దుకాణంలోని యూరియా, పెస్టిసైడ్స్ (pesticide) నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేటు, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా యూరియా సరఫరా సక్రమంగా ఇచ్చేటట్లు చూడాలన్నారు.

    మన జిల్లా రైతులకు మాత్రమే యూరియా అందేటట్లు చెక్ పోస్టులలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మన జిల్లా యూరియా పక్క జిల్లాకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

    urea problems : ప్రత్యామ్నాయంగా నానో యూరియా..

    యూరియాకు ప్రత్యామ్నాయంగా రైతులకు నానో యూరియా చాలా ఉపయోగకరంగా ఉంటుందని, నానో యూరియా రేటు తక్కువ ఉండటంతో పాటు 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని తెలిపారు.

    నానో యూరియా(Nano urea) రవాణాకు అదనంగా ఖర్చులు కూడా ఉండవని, డ్రోన్ ద్వారా సులభంగా పిచికారీ చేయొచ్చని కలెక్టర్​ తెలిపారు. యూరియా బస్తాలకు బదులు నానో యూరియా ప్రమోట్ చేయాలని సూచించారు.

    ప్రాథమిక వ్యవసాయ సంఘం వారు వారి సొసైటీల ఎదుట ఎక్కువ జనం ఉండకుండా ఒక ఊరికి ఏ రోజు ఇస్తారో ముందుగానే ప్రకటిస్తూ యూరియా మేనేజ్మెంట్ చేయాలన్నారు.

    urea problems : పక్కదారి పట్టొద్దు..

    రైతు (farmers) పాస్ పుస్తకం చూసి ఎవరికి ఎంత యూరియా కావాలో అంత తగు మోతాదులోనే ఇవ్వాలన్నారు. ప్రైవేట్ షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షించాలని కలెక్టర్​ ఆదేశించారు.

    సబ్సిడీ యూరియా ఎక్కడా పక్కదోవ పట్టకుండా ఇండస్ట్రీలకు గాని, ప్లైవుడ్ ఇండస్ట్రీస్ (plywood industries) గాని, పెయింట్ ఇండస్ట్రీస్ (paint industries) గాని వెళ్లకుండా అధికారులు పరిశ్రమలను ఆకస్మిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

    కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి (District Agriculture Officer) మోహన్ రెడ్డి, ఏడీఏ, మండల వ్యవసాయ తదితరులు ఉన్నారు.

    Latest articles

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి....

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    CMC Hospital | IMSR ఛైర్మన్​ ఓ పెద్ద మోసగాడు : CMC డైరెక్టర్ డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఆరోపణ

    అక్షరటుడే, ఇందూరు: CMC Hospital : ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ అండ్​ రీసెర్చ్ IMSR ఛైర్మన్​ షణ్ముఖ...

    More like this