ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBajireddy Govardhan | పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బాజిరెడ్డి

    Bajireddy Govardhan | పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బాజిరెడ్డి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ (Former MLA Bajireddy Govardhan) అన్నారు. బాన్సువాడ పట్టణంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను (welfare schemes) పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు.

    రెండేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన 42 శాతం బీసీ రిజర్వేషన్ల (BC reservations) కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ పార్టీ నాయకులే రాలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో పది స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, వాటిని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ప్రజలు సీఎంగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జుబేర్, సాయిబాబా, మోచి గణేష్, చందర్, రమేష్‌ యాదవ్, గౌస్, నర్సింలు, సంజయ్, అనిల్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి....

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    More like this