అక్షరటుడే, డిచ్‌పల్లి: CMC college | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (Institute of Medical Sciences and Research) ఛైర్మన్ షణ్ముఖ మహాలింగం సీఎంసీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని మోసం చేశారని సీఎంసీ డైరెక్టర్ అజ్జ శ్రీనివాస్ ఆరోపించారు.
ఈ మేరకు డిచ్‌పల్లిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాల తిరిగి ప్రారంభించేందుకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ (Church of South India Trust) అసోసియేషన్‌తో షణ్ముఖ మహాలింగం రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని, తనతో రూ.2.20 కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు. ఆస్పత్రిలో వైద్యులను, సిబ్బందిని నియమించుకుని జీతాలివ్వకుండా వారిని మోసం చేశారని పేర్కొన్నారు.
షణ్ముఖ మహాలింగం ఐఏఎస్ (IAS) అని చెప్పుకుని మాయమాటలు చెప్పారని, కళాశాల పునఃప్రారంభానికి పెట్టుబడి పెడితే 5 శాతం షేర్ హోల్డర్‌గా అవకాశమిస్తానని, డైరెక్టర్ చేస్తానని నమ్మించి, రూ.5 కోట్ల విలువైన చెక్కులు తీసుకున్నాడని ఆరోపించారు.