ePaper
More
    HomeసినిమాKota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక...

    Kota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక సంద్రంలో కుటుంబ స‌భ్యులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivas Wife | విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) కొద్ది రోజుల క్రిత‌మే అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతిని మ‌రిచిపోక‌ముందే ఆ ఇంట్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివాస‌రావు స‌తీమ‌ణి రుక్మిణి (Rukmini) ఈ రోజు తెల్ల‌వారుజామున అనారోగ్యంతో క‌న్నుమూసిన‌ట్టు స‌మాచారం. అంత్య‌క్రియ‌లు కూడా పూర్తైన‌ట్టు తెలుస్తుంది. రుక్మిణి ఎప్ప‌టి నుండో అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. కోట, రుక్మిణి దంప‌తుల‌కి ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఆంజ‌నేయ ప్ర‌సాద్ 2010లో రోడ్డు యాక్సిడెంట్‌లో మ‌ర‌ణించాడు.

    Kota Srinivas Wife | మ‌రో విషాదం..

    ఇక తెలుగు సినిమా రంగంలో (Telugu film industry) ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న కోట శ్రీనివాసరావు 1978లో చిరంజీవి హీరోగా నటించిన ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో సుమారు 850కు పైగా సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ (Padma Sri) పురస్కారంతో గౌరవించగా, రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నంది అవార్డులతో ఆయన ప్రతిభను గుర్తించింది.

    నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటిన కోట, 1999 నుండి 2004 వరకూ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం రాజకీయాలకు విరామం ప్రకటించి మళ్లీ నటనలోనే కొనసాగారు. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా రంగానికి దూరమయ్యారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో చివ‌రిసారిగా క‌నిపించి మెప్పించారు కోట‌. చిరకాలంగా ఇండస్ట్రీలో ఉన్న కోట శ్రీనివాసరావు, స్టార్ హీరోలతో అనేక విజయవంతమైన చిత్రాల్లో భాగమయ్యారు. నటనా కాలంలో బిజీ ఆర్టిస్టుగా కొనసాగిన ఆయన, ఆర్థికంగా కూడా స్థిరంగా ఎదిగారు. ఫిల్మ్‌నగర్‌లో ‘శ్రీనివాసం’ పేరుతో ఒక విలాసవంతమైన నివాసం ఉన్న ఆయన, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. 1966లో రుక్మిణి తో ఆయన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు వివాహమై పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు.

    Latest articles

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    CMC Hospital | IMSR ఛైర్మన్​ ఓ పెద్ద మోసగాడు : CMC డైరెక్టర్ డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఆరోపణ

    అక్షరటుడే, ఇందూరు: CMC Hospital : ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ అండ్​ రీసెర్చ్ IMSR ఛైర్మన్​ షణ్ముఖ...

    Bajireddy Govardhan | పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బాజిరెడ్డి

    అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే...

    More like this