అక్షరటుడే, డిచ్పల్లి: Railway gate | మండలంలోని ఘన్పూర్-డిచ్పల్లి (Ghanpur-Dichpally) మధ్య రైల్వేగేట్‌ను మరమ్మతుల దృష్ట్యా మూసివేయనున్నారు. ఈ మేరకు డిచ్పల్లి పంచాయతీ కార్యదర్శి రమేశ్ (Panchayat Secretary Ramesh) సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ రాత్రి 11 గంటల వరకు రైల్వేగేట్ మూసి ఉంటుందని ఆయన వివరించారు.
రైలు పట్టాల మరమ్మతుల (Railway track repairs) కారణంగా గేట్‌ను ముసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి ఘన్పూర్, ముల్లంగి, ఖిల్లా డిచ్పల్లి గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లాలని ఆయన సూచించారు.