అక్షరటుడే ఇందూరు : Anganwadi Centers | అంగన్వాడీ ఉద్యోగుల ఫొటో క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (CITU District General Secretary Noor Jahan) అన్నారు.
నగరంలోని ధర్నా చౌక్‌లో సోమవారం వర్షంలోనే మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చే సందర్భంగా యాప్‌లో ఫేస్ క్యాప్చర్ (Face Capture) విధానాన్ని తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు.
అంగన్వాడీ టీచర్ల (Anganwadi Teachers) వద్ద ఉన్న ఫోన్లు పాతవి ఉండడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ రావట్లేదని స్పష్టం చేశారు. దీంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం లభించడం లేదని తెలిపారు. ఇది పూర్తిగా ఆహార భద్రత చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించారు.
మరోవైపు ఫొటో క్యాప్చర్ చేయాల్సిందేనంటూ అధికారులు టీచర్లపై వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, వికలాంగుల జాతీయ వేదిక నాయకుడు గంగాధర్, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, మంగాదేవి, ప్రమీల, గోదావరి, వాణి, ఎలిజిబెత్ రాణి, జరీనా తదితరులు పాల్గొన్నారు.