ePaper
More
    HomeతెలంగాణVinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు ఆన్​లైన్​లో సమాచారం నమోదు చేసుకోవాలి

    Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు ఆన్​లైన్​లో సమాచారం నమోదు చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు.

    ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం గణే మండళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్​ సీఐ మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన, చేయకూడని పనులను స్పష్టంగా వివరించారు.

    గణనాథులను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఇన్​ఛార్జీల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని పేర్కొన్నారు.  విద్యుత్​ కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

    Vinayaka Chavithi |  మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలి

    మండపాల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే భద్రతాపరంగా బాగుంటుందని సీఐ శ్రీనివాస్​ సూచించారు. ఫైర్​ యాక్సిడెంట్స్​ జరిగితే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇసుక, నీళ్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సౌండ్​బాక్స్​లు పెట్టరాదని వివరించారు.

    వినాయకులను వాహనాల్లో తరలించే సమయంలో ఇనుపపైపులకు బదులుగా పీవీసీ పైప్​లతోనే వైర్లను జరపాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ గణేష్​ మండపాల నిర్వాహకులు చిరంజీవి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    పాల్గొన్న గణేష్​ మండల నిర్వాహకులు

    Latest articles

    CMC Hospital | IMSR ఛైర్మన్​ ఓ పెద్ద మోసగాడు : CMC డైరెక్టర్ డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ఆరోపణ

    అక్షరటుడే, ఇందూరు: CMC Hospital : ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ అండ్​ రీసెర్చ్ IMSR ఛైర్మన్​ షణ్ముఖ...

    Bajireddy Govardhan | పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బాజిరెడ్డి

    అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే...

    CP Sai chaitanya | కందకుర్తి వద్ద గోదావరిని పరిశీలించిన సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai chaitanya | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) గోదావరిలోకి ఉధృతంగా...

    CMC college | షణ్ముఖ మహాలింగమే వైద్యులను, సిబ్బందిని మోసం చేశాడు..: అజ్జ శ్రీనివాస్​

    అక్షరటుడే, డిచ్‌పల్లి: CMC college | ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (Institute of Medical...

    More like this