అక్షరటుడే, డిచ్‌పల్లి: CMC college | వైద్యుడు అజ్జ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన మోసం కారణంగానే డిచ్‌పల్లి సీఎంసీకి (Dichpally) ఈ దుస్థితి వచ్చిందని సీఎంసీ మెడికల్ కళాశాల ఛైర్మన్ షణ్ముఖ మహాలింగం (Shanmukha Mahalingam) ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్జ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకొని సీఎంసీ సంస్థలను నిర్వహించే ఐఎంఎస్ఆర్ (ICMR) ఛైర్మన్‌ను కలిశారని ఆయన ఆరోపించారు. ఆ విధంగా వారిని కలిసి డిచ్‌పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాలను (Christian Medical College) నడుపుతామని మోసం చేశాడని ఆయన పేర్కొన్నారు.
మెడికల్ కళాశాల (Medical College), ఆస్పత్రి, దాంట్లో ఫార్మసీ దుకాణాల నిర్వహణ, నిర్మాణ పనులన్నీ చక్కబెడతానని చెప్పిన అజ్జ శ్రీనివాస్ తర్వాత వైద్యులకు, సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయారని షణ్ముఖ మహాలింగం ఆరోపించారు.
ఐఎంఎస్ఆర్కు అజ్జ శ్రీనివాస్ డిపాజిట్‌గా ఇచ్చిన రూ. 5కోట్ల చెక్కులు సైతం బౌన్స్ అయ్యాయని ఆయన వివరించారు. మధ్యవర్తి శంకర చారి ఇతరులతో కలిసి డాక్టర్ అజ్జ శ్రీనివాస్ రూ.92 లక్షల సీఎంసీ నిధులను దుర్వినియోగం చేసేందుకు కుట్రపన్నాడని షణ్ముఖ మహాలింగం ఆరోపించారు.