అక్షర టుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలపై సోలార్ పవర్ (Solar Power) పరికరాల ఏర్పాటుకు శాఖల వారీగా వెంటనే నివేదికలు అందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి (Collector T Vinay Krishna Reddy) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, గురుకులాల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు, నీటి పారుదల, మిషన్ భగీరథ శాఖలకు (Mission Bhagiratha Branch) చెందిన ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు వీటి ఏర్పాటుకు సంబంధించి నివేదికలు రూపొందించి, మంగళవారం సాయంత్రం అందించాలన్నారు. పరికరాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, విద్యుత్ కనెక్షన్, తదితర వివరాలను నివేదికలో పొందుపర్చాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.