ePaper
More
    Homeబిజినెస్​Stock Market | మార్కెట్‌కు ‘దీపావళి’ కాంతులు.. భారీగా పెరిగిన సూచీలు..

    Stock Market | మార్కెట్‌కు ‘దీపావళి’ కాంతులు.. భారీగా పెరిగిన సూచీలు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దీపావళిలోగా జీఎస్టీ(GST)లో సంస్కరణలు తెస్తామన్న ప్రధాని మోదీ(PM Modi) ప్రకటన బుల్స్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో నూతన వారం భారీ లాభాలతో ప్రారంభమైంది.

    సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 718 పాయింట్ల భారీ గ్యాప్‌ అప్‌తో ప్రారంభమై అక్కడినుంచి మరో 450 పరుగులు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో 563 పాయింట్లు పడిపోయింది. 307 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ (Nifty) అక్కడినుంచి మరో 84 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 170 పాయింట్లు తగ్గింది. చివరికి సెన్సెక్స్‌ (Sensex) 676 పాయింట్ల లాభంతో 81,273 వద్ద, నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 24,876 వద్ద స్థిరపడ్డాయి.

    అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,562 కంపెనీలు లాభపడగా 1,627 స్టాక్స్‌ నష్టపోయాయి. 176 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 156 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 116 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 5.27 కోట్లు పెరిగింది.

    ఐటీ, పవర్‌ సెక్టార్లు మినహా..

    ఐటీ(IT), పవర్‌ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల స్టాక్స్‌ భారీగా పెరిగాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.53 శాతం, పవర్‌ ఇండెక్స్‌ 0.28 శాతం నష్టపోయాయి. ఆటో ఇండెక్స్‌(Auto index) 4.26 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 3.08 శాతం, రియాలిటీ 2.19 శాతం, కమోడిటీ 1.96 శాతం, మెటల్‌ 1.95 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ 1.80శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టెలికాం ఇండెక్స్‌లు 1.15 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 1.11 శాతం ముగిశాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.39 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.09 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఒక శాతం లాభపడ్డాయి.

    Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి.
    మారుతి 8.94 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.02 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 3.71 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.70 శాతం, ఎంఅండ్‌ఎం 3.54శాతం లాభాలతో ముగిశాయి.

    Top Losers : ఐటీసీ 1.26 శాతం, ఎల్‌టీ 1.18 శాతం, ఎటర్నల్‌ 1.16 8 శాతం, టెక్‌ మహీంద్రా 1.02 శాతం, ఎన్టీపీసీ 0.91 శాతం నష్టపోయాయి.

    Latest articles

    Bajireddy Govardhan | పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం: బాజిరెడ్డి

    అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే...

    CP Sai chaitanya | కందకుర్తి వద్ద గోదావరిని పరిశీలించిన సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai chaitanya | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) గోదావరిలోకి ఉధృతంగా...

    CMC college | షణ్ముఖ మహాలింగమే వైద్యులను, సిబ్బందిని మోసం చేశాడు..: అజ్జ శ్రీనివాస్​

    అక్షరటుడే, డిచ్‌పల్లి: CMC college | ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (Institute of Medical...

    Nizamabad Collector | యూరియా పక్కదారి పట్టించే వారిపై కఠినచర్యలు తీసుకోండి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | యూరియా, ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ...

    More like this