అక్షరటుడే, వెబ్డెస్క్ : Vice President Candidate| ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండి కూటమి యోచిస్తోంది. ఈ మేరకు తమ అభ్యర్థిగా డీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ(Rajya Sabha MP Tiruchi Siva)ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
సీపీ రాజేంద్రన్ ను ఎంపిక చేయడం బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని భావించగా, అందుకు విరుగుడుగా ఇండి కూటమి శివను తెరపైకి తీసుకొస్తోంది. రానున్న రాబోయే ఎన్నికల్లో తమిళ నేతను పోటీకి పెట్టడం ద్వారా బీజేపీ(BJP)కి రాజకీయ ఎత్తుగడలకు చెక్ పెట్టడానికి ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Congress chief Mallikarjun Kharge) ఇంట్లో సోమవారం సాయంత్రం సమావేశం కానున్న విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నాయి.
Vice President Candidate | బీజేపీ ఎత్తుగడలకు విరుగుడు..
తమిళనాడుకు చెందిన కీలక నాయకుడు, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(Maharashtra Governor CP Radhakrishnan) ను రాష్ట్రపతి అభ్యర్తిగా బీజేపీ ఆదివారం ప్రకటించింది. తద్వారా వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని భావించింది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాలను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు కొత్త ప్రణాళిక రచిస్తున్నాయి. శివను అభ్యర్థిగా ఎంచుకోవడం ద్వారా ప్రాంతీయ రాజకీయాల చిక్కులను అధిగమించడంలో ప్రతిపక్షాలకు సహాయపడుతుందని భావిస్తున్నాయి. తమిళనాడు(Tamilnadu)లో పాగా వేయాలన్న బీజేపీ ఎత్తుగడలను శివ ఎంపిక ద్వారా అడ్డుకోవచ్చని పేర్కొంటున్నాయి. శివ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం వల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్డీయే కొంత ఒత్తిడిని ఎదుర్కోనే అవకాశముంది. ఆయనను అభ్యర్థిగా ఖరారు చేస్తే దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. డీఎంకే ఇప్పటికే ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.