అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి (Collector T Vinay Krishna Reddy) అర్జీలు స్వీకరించారు.
అనంతరం వాటి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 52 ఫిర్యాదులు అందగా.. కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రావు వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.