ePaper
More
    Homeక్రైంRajasthan | బ్లూ డ్రమ్‌లో కుళ్లిన భ‌ర్త డెడ్ బాడీ.. భార్య‌, పిల్ల‌లు మిస్సింగ్​..

    Rajasthan | బ్లూ డ్రమ్‌లో కుళ్లిన భ‌ర్త డెడ్ బాడీ.. భార్య‌, పిల్ల‌లు మిస్సింగ్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | మరోసారి బ్లూ డ్రమ్‌లో మృతదేహం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో (Alwar District) ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. బ్లూ డ్రమ్‌ (Blue Drum) తెరిచి చూడగా, అందులో కుళ్లిన స్థితిలో ఓ పురుషుడి శవం బయటపడడంతో పోలీసులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు.

    పోలీసుల సమాచారం ప్రకారం.. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హన్సరాజ్ అలియాస్ సురాజ్ (వయసు 35) అనే వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం రాజస్థాన్‌కు (Rajasthan) వచ్చిన ఆయన, అల్వార్ జిల్లాలోని తిజారా ప్రాంతంలోని ఆదర్శ్ కాలనీలో (Adarsh Colony) భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు.

    Rajasthan | దుర్వాసనతో వెలుగులోకి హత్య?

    గత కొన్ని రోజులుగా హన్సరాజ్ ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడం గమనించిన పొరుగువారు, పరిస్థితి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Rajasthan Police) ఇంటి లోపల బ్లూ డ్రమ్‌ను పరిశీలించగా, అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో, మృతుడి మరణించి చాలా రోజులే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే.. హన్సరాజ్ భార్య, ముగ్గురు పిల్లలు ప్రస్తుతం ఎక్క‌డ ఉన్నారో తెలియ‌డ‌రావ‌డం లేదు. సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత వారు ఎక్కడికైనా వెళ్లిపోయారా? లేదా వారు మ‌ర‌ణించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

    ఈ ఘటనపై అల్వార్ డీఎస్పీ రాజేష్ కుమార్ (Alwar DSP Rajesh Kumar) మాట్లాడుతూ, “ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని సమాచారం అందింది. సెర్చ్ చేసినప్పుడు బ్లూ డ్రమ్‌లో యువకుడి మృతదేహం కనిపించింది. అతడిని హన్సరాజ్ అలియాస్ సురాజ్‌గా గుర్తించాం. ఇతడు ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. అతని భార్య, పిల్లలు ఇప్పుడు కనిపించకపోవడం అనుమానాల‌కు తావిస్తోంది. ప్రాథమికంగా ఇది హత్య అనుమానిస్తున్నాం. కుటుంబసభ్యుల నుంచి పక్కా సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు. శ‌వం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో పోస్టుమార్టం ద్వారా స్పష్టత రావాల్సి ఉంది. హన్సరాజ్‌ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అన్న విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అతని స్వగ్రామానికి చెందిన కొంద‌రిని కూడా విచారణ చేస్తున్నారు.

    Latest articles

    Kota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక సంద్రంలో కుటుంబ స‌భ్యులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivas Wife | విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa...

    Umamaheswara Temple | గోదావరికి భారీ వరద.. గంగమ్మ ఒడిలో ఉమామహేశ్వరాలయం…

    అక్షరటుడే, ఆర్మూర్: Umamaheswara Temple | ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజాంసాగర్...

    Railway gate | ఘన్​పూర్ రైల్వేగేట్ మూసివేత.. ఎప్పటి నుంచంటే..!

    అక్షరటుడే, డిచ్​పల్లి: Railway gate | మండలంలోని ఘన్​పూర్-డిచ్​పల్లి (Ghanpur-Dichpally) మధ్య రైల్వేగేట్​ను మరమ్మతుల దృష్ట్యా మూసివేయనున్నారు. ఈ...

    Hyderabad Rains | మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద ఉధృతి కట్టడిపై హైడ్రా నజర్​

    అక్షరటుడే, హైదరాబాద్​: Hyderabad Rains | అమీర్‌పేట మెట్రో స్టేష‌న్ (Ameerpet Metro Station), మైత్రివ‌నం వ‌ద్ద వ‌ర‌ద...

    More like this