అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Gate | టోల్‌ప్లాజా వద్ద ఆలస్యం జరుగుతుండడాన్ని ప్రశ్నించిన ఆర్మీ జవానుపై (Army Soldier) అక్కడి సిబ్బంది దాడికి పాల్పడ్డారు. కారు నుంచి బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టారు. స్తంభానికి కట్టి దాడి సైనికుడిపై దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు టోల్ బూత్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన కపిల్ కవాద్ సైన్యంలోని రాజ్‌పుత్ రెజిమెంట్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన అతడు తిరిగి విధుల్లో చేరేందుకు గాను శ్రీనగర్‌కు బయల్దేరాడు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఢిల్లీ విమానాశ్రయానికి (Delhi Airport) వెళ్తుండగా, మేరఠ్‌లోని భూని టోల్‌గేట్ (Bhuni Tollgate) వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు.
Toll Gate | ప్రశ్నించినందుకు..
ట్రాఫిక్ ముందుకు కదలక పోవడం, విమానానికి ఆలస్యం అవుతుండడంతో కపిల్ ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో టోల్‌గేట్ వద్ద వాహనాలను ముందుకు పంపించడంలో అక్కడి సిబ్బంది ఆలస్యం చేస్తుండడాన్ని గమనించిన అతడు.. సిబ్బందిని ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదానికి దిగిన టోల్ సిబ్బంది (Tollgate Staff) రెచ్చిపోయారు. కపిల్‌ను కారు నుంచి బయటకు లాగి దాడి చేశారు. కొంతమంది దుండగులు కపిల్ చేతలను వెనక్కి లాగి ఒక స్తంభానికి అదిమి పెట్టి ఉంచగా, మరో వ్యక్తి కర్రతో కొడుతుండడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
Toll Gate | నలుగురి అరెస్టు..
ఇది వైరల్ కావడంలో టోల్‌సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. గాయపడిన కపిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రాకేష్ కుమార్ మిశ్రా (SP Rakesh Kumar Misra) తెలిపారు. “ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న కపిల్ ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చాడు. తిరిగి విధుల్లో చేరేందుకు శ్రీనగర్ వెళ్తున్నాడు. అయితే, భూని టోల్ బూత్ వద్ద వాహనాలు బారులు తీరడంతో కపిల్ టోల్ బూత్ సిబ్బందితో మాట్లాడాడు.
దీంతో వాగ్వాదం ప్రారంభమైంది. టోల్ బూత్ సిబ్బంది అతనిపై దాడి చేశారు. బాధితుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో(Saroorpur Police Station) కేసు నమోదు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను పరిశీలించిన అనంతరం నలుగురు నిందితులను అరెస్టు చేశాం. ఇతర నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలు పని చేస్తున్నాయి” అని వివరించారు.మరోవైపు, కపిల్ టోల్ నుంచి మినహాయింపు కోరగా, సిబ్బంది నిరాకరించడంతో గొడవ జరిగినట్లు మరో వాదన వినిపిస్తోంది.
View this post on Instagram