అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gem Aromatics IPO | అరోమా కెమికల్స్(Aroma chemicals) తయారీలో నైపుణ్యం కలిగిన జెమ్ అరోమాటిక్స్ లిమిటెడ్.. ఐపీవోకు వస్తోంది. సబ్‌స్క్రిప్షన్(Subscription) మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. లిస్టింగ్ రోజే పది శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
జెమ్ అరోమాటిక్స్(Gem Aromatics) లిమిటెడ్ కంపెనీని 1997లో స్థాపించారు. ఇది అరోమా కెమికల్స్, ఎస్సెన్షియల్ ఆయిల్స్, వ్యాల్యూ యాడెడ్ డెరివేటివ్స్ వంటి ప్రత్యేకమైన ఇంగ్రేడియంట్స్ తయారు చేస్తుంది. నాలుగు వర్గాలలో 70 ఉత్పత్తులను తయారు చేసి, B2B ప్రాతిపదికన విక్రయిస్తుంది. ప్రత్యక్ష అమ్మకాలతోపాటు యూఎస్ అనుబంధ సంస్థ అయిన జెమ్ అరోమాటిక్స్ ఎల్‌ఎల్‌సీతోపాటు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా ఎగుమతి చేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియాలతోపాటు ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 18 దేశాలలో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
Gem Aromatics IPO | రూ. 451 కోట్లు సమీకరించేందుకు..
మార్కెట్‌నుంచి రూ. రూ. 451.25 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో జెమ్ అరోమాటిక్స్ ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 2 ఫేస్ వ్యాల్యూ కలిగిన 53,84,615 షేర్లను విక్రయించి రూ. 175 కోట్లు సమీకరించనుంది. రూ. 2 ఫేస్ వాల్యూ కలిగిన 85 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(Offer for sale) ద్వారా విక్రయించి, మిగిలిన మొత్తాన్ని సమీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ అప్పులను చెల్లించడం, సాధారణ కార్పొరేట్ అవసరాలకోసం వినియోగించనున్నట్లు పేర్కొంది.
Gem Aromatics IPO | కంపెనీ ఆర్థిక పరిస్థితి..
2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం(Revenue) రూ. 454 కోట్లు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 506 కోట్లకు చేరింది. నికరలాభం(Net profit) రూ. 50.10 కోట్లనుంచి రూ. 53.38 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు(Assets) రూ. 369 కోట్లనుంచి రూ. 535 కోట్లకు వృద్ధి చెందాయి.
Gem Aromatics IPO | ధరల శ్రేణి..
కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 309 నుంచి రూ. 325 గా నిర్ణయించింది. ఐపీవోలో పాల్గొనాలనుకునేవారు కనీసం 46 షేర్లకోసం(ఒక లాట్) గరిష్ట ప్రైస్ బాండ్ వద్ద రూ. 14,950తో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Gem Aromatics IPO | కోటా, జీఎంపీ వివరాలు..
ఈ ఐపీవోలో క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకి 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం వాటాను కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం(జీఎంపీ) రూ. 35 లుగా ఉంది. ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ రేజే 10 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Gem Aromatics IPO | ముఖ్యమైన తేదీలు..
ఐపీవో సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభమవుతుంది. 21 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల తాత్కాలిక కేటాయింపు వివరాలు 22న రాత్రి వెల్లడయ్యే అవకాశం ఉంది. కంపెనీ షేర్లు ఈనెల 26న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.