ePaper
More
    HomeతెలంగాణHeart Attack | ఘనంగా కూతురి పెళ్లి.. అప్పగింతల సమయంలో ఆగిన తల్లి గుండె

    Heart Attack | ఘనంగా కూతురి పెళ్లి.. అప్పగింతల సమయంలో ఆగిన తల్లి గుండె

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heart Attack | పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. తన కూతురి పెళ్లిని ఓ మహిళ ఘనంగా నిర్వహించింది. బిడ్డను అత్తరింటికి పంపే సమయంలో గుండెపోటుతో కుప్పకూలింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో చోటు చేసుకుంది.

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలం(Kamepalli Mandal) అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహన్‌లాల్, కల్యాణి(38) దంపతులు. వీరికి కుమార్తె సింధుకు టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. ఆదివారం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం కూతురిని అత్తగారింటికి పంపే సమయంలో కల్యాణి భావోద్వేగానికి గురైంది. ఆ సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. హార్ట్​ ఎటాక్​తో కుప్పకూలిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.

     Heart Attack | కలవర పెడుతున్న గుండెపోట్లు

    దేశంలో ఇటీవల గుండెపోట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. యువకులు సైతం హార్ట్​ ఎటాక్(Heart Attack)​తో మృతి చెందుతున్నారు. మారుతున్న జీవనశైలితో గుండెపోటు కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.గతంలో హార్ట్​ ఎటాక్​ వచ్చినా.. హాస్పిటల్​కు వెళ్లే వరకు సమయం ఉండేది. కానీ ప్రస్తుతం అప్పటి వరకు బాగానే ఉండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపే మృతి చెందుతున్నారు.

    Latest articles

    Collector Nizamabad | సోలార్‌ పవర్‌ ఏర్పాటుకు నివేదికలు అందించాలి

    అక్షర టుడే, ఇందూరు : Collector Nizamabad | జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలపై సోలార్‌...

    Stock Market | మార్కెట్‌కు ‘దీపావళి’ కాంతులు.. భారీగా పెరిగిన సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దీపావళిలోగా జీఎస్టీ(GST)లో సంస్కరణలు తెస్తామన్న ప్రధాని మోదీ(PM Modi) ప్రకటన...

    Vice President Candidate | ఇండి కూటమి అభ్యర్థిగా తిరుచ్చి శివ?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Candidate| ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండి కూటమి...

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    More like this