అక్షరటుడే, వెబ్డెస్క్ : kodangal | అంబులెన్స్ (ambulance) లేకపోవడంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై తీసుకెళ్లారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో (Narayanpet district) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి.
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మొగులప్ప (28)ను టిప్పర్ ఢీకొంది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే 108కు ఫోన్ చేసినా అందుబాటులో లేదు. దీంతో మృతదేహాన్ని ఓ తోపుడు బండిపై వేసుకొని అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఆస్పత్రి వరకు లాక్కెళ్లారు.
kodangal | తీవ్ర విమర్శలు
మృతదేహాన్ని తోపుడి బండిపై తీసుకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో (social media) వైరల్ అవుతున్నారు. మృతదేహాన్ని ఇలా తీసుకు వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పేదవాడి మృతిపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై మండి పడుతున్నారు.
View this post on Instagram