ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    Simhachalam | సింహాచలం ఘటనపై విచారణ కమిషన్​ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simhachalam | విశాఖపట్నం జిల్లా సింహాచలం Simhachalam అప్పన్న appanna స్వామి చందనోత్సవాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ PM modi, సీఎం చంద్రబాబు cm chandrababu, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ pavan kalyan దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణ కమిషన్ Inquiry Commission ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    మున్సిపల్ కమిషనర్ Municipal Commissioner సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఐపీఎస్ IPS అధికారి ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్​ చీఫ్ వేంకటేశ్వరరావు ఈ కమిషన్​లో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయశాఖ ఆలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం వైఎస్​ జగన్ YS Jagan​ నాసిరకం పనులతోనే గోడ కూలిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...