Asia Cup 2025 : భారత క్రికెట్ అభిమానులకు (Indian cricket fans) ఆసియా కప్‌కి ముందు శుభవార్త అందింది. టీమిండియా (Team India) స్టార్ బ్యాట్స్‌మన్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (T20 captain Suryakumar Yadav) పూర్తిగా ఫిట్‌నెస్ పొందాడు.
జర్మనీలో శస్త్రచికిత్స అనంతరం అతను తిరిగి ఫిట్‌నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయగా, బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Center of Excellence – COE) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జూన్ నెలలో గజ్జల్లో గాయం కారణంగా జర్మనీలో సూర్య శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (National Cricket Academy – NCA)లో పునరావాస కార్యక్రమంలో పాల్గొంటూ.. తాను త్వరగా కోలుకునేందుకు కృషి చేశాడు.
Asia Cup 2025 : సూర్య ఈజ్ బ్యాక్..
తాజాగా అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో Fitness Test ఉత్తీర్ణుడవడంతో, సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. బీసీసీఐ వర్గాల ప్రకారం, అతను త్వరలో జట్టును ఎంపిక చేసే సమావేశంలో హాజరవుతాడు. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. టోర్నీలో కీలకమైన మ్యాచ్ సెప్టెంబర్ 14న భారత్ – పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో, సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశమై భారత్ జట్టును ప్రకటించనుంది. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాగా, సూర్య కుమార్ యాదవ్ తన శస్త్రచికిత్స అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. “శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. త్వరలోనే తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత, అతను యూకే వెళ్లి అక్కడ స్పెషలిస్ట్‌ను కలిసి, ఆ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ Suryakumar Yadav తన బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు కీలక విజయాలు అందించాడు. మొత్తం 717 పరుగులు చేసి, సచిన్ టెండూల్కర్ తర్వాత ఒకే సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసిన రెండవ ముంబై ప్లేయర్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ (759 పరుగులు) తర్వాత పరుగుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన సూర్య, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.