ePaper
More
    Homeతెలంగాణelectric shock in Krishnashtami celebrations | కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం.. ర‌థానికి క‌రెంట్ వైర్లు...

    electric shock in Krishnashtami celebrations | కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం.. ర‌థానికి క‌రెంట్ వైర్లు త‌గిలి ఐదుగురు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: electric shock in Krishnashtami celebrations: హైద‌రాబాద్ (Hyderabad) నగరంలోని రామంతాపూర్‌లోRamantapur ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

    శ్రీకృష్ణాష్టమి వేడుక(Sri Krishnashtami celebrations)ల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

    సంబంధిత వివరాల ప్రకారం, రామంతాపూర్ గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన రథయాత్ర(Rath Yatra)లో రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో, యువకులు స్వయంగా చేతులతో రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే రథం పైభాగం ఓ విద్యుత్ తీగను తాకింది.

    electric shock in Krishnashtami celebrations : తీవ్ర విషాదం..

    దీంతో విద్యుదాఘాతం సంభవించి తొమ్మిది మంది కింద పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులలో కృష్ణ యాదవ్ (21), సురేష్ యాదవ్ (34), శ్రీకాంత్ రెడ్డి (35), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) ఉన్నారు.

    గాయపడిన నలుగురిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ Srinivas ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మృతులను సీపీఆర్ ద్వారా బ్రతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

    గాయపడిన వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా… మరొకరు నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నట్లు స‌మాచారం.

    ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేడుకలలో విషాదం నింపిన ఈ ఘటనపై విచారణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. విద్యుత్ శాఖ, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి పూర్తి నివేదిక అందించనున్నారు. అయితే ఇలాంటి పబ్లిక్ ఈవెంట్లలో Public events విద్యుత్ సరఫరా, ఇతర ప్రమాణాలపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులని ప్ర‌జలు కోరుతున్నారు.

    Latest articles

    Weather Updates | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains)...

    Lord Venkateswara darshan | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Lord Venkateswara darshan : తిరుమల(TIRUMALA)లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 25 కంపార్టుమెంట్ల(compartments)లో భక్తులు...

    HYD electric shock | మ‌రో విషాదం.. వినాయ‌క విగ్ర‌హాన్ని త‌ర‌లిస్తుండ‌గా క‌రెంట్ షాక్.. ఇద్ద‌రి దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: HYD electric shock : హైదరాబాద్‌(Hyderabad)లో తాజా జ‌రిగిన రెండు ప్ర‌మాదాలు అంద‌రినీ క‌లిచివేస్తున్నాయి. పండుగ‌ల...

    professional game Cricket | చివ‌రి బంతికి రెండు ప‌రుగులు.. ఉత్కంఠభ‌రిత మ్యాచ్‌లో ఏం జ‌రిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: professional game Cricket : క్రికెట్ Cricket అనేది ప్రొఫెష‌న‌ల్ గేమ్‌గా మారింది. చిన్న పిల్లాడి...

    More like this