అక్షరటుడే, నిజాంసాగర్ : Heavy rains monitoring : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. నిజాంసాగర్ (Nizamsagar), కౌలాస్నాలాలోకి ప్రాజెక్ట్ ల్లోకి వరద పోటెత్తుతోంది. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (Jukkal MLA Thota Laxmikantharao) నిరంతం పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు అధికారులను సమన్వయం చేసుకుంటూ వెళ్లారు. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టుకు వెళ్లారు. అధికారులతో మాట్లాడారు. నీటి విడుదలను పర్యవేక్షించారు.
అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar project)కు చేరుకున్నారు. ఎగువ భాగం నుంచి వరద ఇన్ఫ్లో భారీగా ఉండటంతో అర్ధరాత్రి సమయంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటి విడుదలను స్వయంగా ప్రారంభించారు. మంజీర పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Heavy rains monitoring : నేడు పాఠశాలలకు సెలవులు..
భారీ వర్షాల కారణంగా సింగితం రిజర్వాయర్ (Singeetham reservoir) అలుగు పొంగిపొర్లుతోంది. ఫలితంగా మహమ్మద్ నగర్ మండలంలోని తునికిపల్లి గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు కామారెడ్డి కలెక్టర్ ఈరోజు(సోమవారం సెలవు ప్రకటించారు.