ePaper
More
    Homeబిజినెస్​Today Pre Market Analysis | ట్రంప్‌, పుతిన్‌ భేటీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న...

    Today Pre Market Analysis | ట్రంప్‌, పుతిన్‌ భేటీ.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Pre Market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు గత ట్రేడింగ్(Trading) సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ట్రంప్‌, పుతిన్‌ భేటీ అనంతర పరిణామాలతో మన దేశంపై సుంకాల భారం తగ్గవచ్చన్న అంచనాలతో గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) మాత్రం భారీ గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.

    Today Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    గత ట్రేడింగ్ సెషన్‌ నాస్‌డాక్‌(Nasdaq) 0.40 శాతం, ఎస్‌అండ్‌పీ 0.29 శాతం నష్టపోయాయి. ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.19 శాతం లాభంతో సాగుతోంది.

    Today Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.42 శాతం, డీఏఎక్స్‌ 0.07 శాతం నష్టపోగా.. సీఏసీ మాత్రం 1.50 శాతం లాభాలతో ముగిసింది.

    Today Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    సోమవారం ఉదయం 8.10 గంటల సమయంలో నిక్(Nikkei)కీ 0.86 శాతం, షాంఘై 0.71 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.32 శాతం లాభంతో ఉన్నాయి. కోస్పీ 1.35 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.53 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.12 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 1.22 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Today Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో రోజూ నికర అమ్మకందారులుగానే నిలిచారు. నికరంగా రూ. 1,926 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు 29వ ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 3,895 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.08 నుంచి 1.01కు తగ్గింది. విక్స్‌(VIX) 1.77 శాతం తగ్గి 12.36కు చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.13 శాతం తగ్గి 65.76 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీనపడి 87.55 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.31 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.88 వద్ద కొనసాగుతున్నాయి.
    • మూడు రోజుల లాంగ్‌ వీకెండ్‌ తర్వాత మారుతున్న పరిస్థితులతో మన సూచీలు బలంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    • జులైకి సంబంధించిన మన దేశ నిరుద్యోగిత రేటు సోమవారం విడుదల కానుంది. ఫారెక్స్‌ నిల్వల వివరాలు ఈనెల 22న వెలువడనున్నాయి.
    • జులైలో జరిగిన యూఎస్‌ ఎఫ్‌వోఎంసీ(FOMC) ద్రవ్య విధాన సమావేశం మినట్స్‌ బుధవారం వెలువడనున్నాయి. కీలకమైన వడ్డీ రేట్ల విషయంలో ఏ ప్రకటన చేస్తారన్న విషయమై గ్లోబల్‌ మార్కెట్లు వేచి చూస్తున్నాయి.

    చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ సోమవారం భారత్‌కు రానున్నారు. వివిధ అంశాలపై ఆయన బృందం మన ప్రతినిధులతో సమావేశమవనుంది. ఈనెల 21న మన విదేశాంగ మంత్రి రష్యాలో ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశం కానున్నారు. ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

    Latest articles

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....

    Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ Q1 ఫలితాలు: లాభాలు తగ్గుముఖం, ఆదాయం, వ్యాపారం వృద్ధి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1FY26)...

    More like this

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....