అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tea Side effects | చాలామందికి టీ తాగడం ఒక వ్యసనం లాంటిది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు తాగినా తనివి తీరదు. ఒకవేళ టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. టీ తాగితేనే రోజు గడుస్తుందని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే టీలో ఉండే కెఫిన్, టానిన్ (caffeine and tannins) వంటి పదార్థాలు శరీరానికి ఎన్నో రకాల హానికరమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. వాటిలో కొన్ని సాధారణంగా కనిపించేవి ఆందోళన, నిద్ర భంగం, గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు, ఐరన్ లోపం, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు. అధికంగా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు, వాటిని నియంత్రించే విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tea Side effects | టీ తాగడం వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాలు:
కెఫిన్ సంబంధిత సమస్యలు: టీలో ఉండే కెఫిన్ వల్ల కొందరిలో ఆందోళన, భయం పెరుగుతాయి. ముఖ్యంగా కెఫిన్‌కు సున్నితంగా ఉండే వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, నిద్రకు ఆటంకం కలిగించి నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.
జీర్ణ సమస్యలు: టీలో ఉండే టానిన్లు కడుపులో చికాకు కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో టీ(Tea Side effects) తాగితే గుండెల్లో మంట, వికారం, విరేచనాల వంటి సమస్యలు రావచ్చు.
ఐరన్ లోపం: టానిన్లు ఐరన్‌ను గ్రహించే ప్రక్రియకు అడ్డుపడతాయి. ముఖ్యంగా మొక్కల ఆధారిత ఆహారాల నుండి లభించే ఐరన్‌ను శరీరం (Body) గ్రహించడం కష్టం అవుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.
దంత సమస్యలు: ఎక్కువగా బ్లాక్ టీ (Black Tea) తాగడం వల్ల దంతాలపై నల్లటి మరకలు ఏర్పడతాయి. టీలో ఉండే ఆమ్లాలు దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి.
గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్: కెఫిన్ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
గుండె దడ: కెఫిన్ గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. దీనివల్ల గుండె దడ రావచ్చు. గుండె జబ్బులు(Heart Deceases) ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
నిర్జలీకరణం: టీకి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగించే గుణం ఉంది. సరైన మోతాదులో నీరు తీసుకోకుండా అధికంగా టీ తాగితే నిర్జలీకరణం సంభవించవచ్చు.
ఎముకల సమస్యలు: కొన్ని పరిశోధనల ప్రకారం, అధికంగా టీ తాగడం వల్ల ఎముకల ఖనిజ సాంద్రత తగ్గి, ఎముకలు బలహీనపడతాయి.
మూత్రపిండాల్లో రాళ్ళు: టీలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువ పరిమాణంలో శరీరంలోకి వెళితే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.