అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా పర్యటించిన తర్వాత ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి (Armoor constituency) శనిలా తయారైన కాంగ్రెస్ (Armoor Congress), బీజేపీల (Bjp Armoor) పీడ వదిలిస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ శ్రేణులు ’స్థానిక ’యుద్దానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 86 గ్రామ పంచాయతీలు, 36 మున్సిపల్ వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి తీరాలన్న కసితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, పదేళ్లలో ఆర్మూర్ ప్రగతికి తాము చేసిన కృషిని గుర్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Jeevan Reddy | పదేళ్లలో ఆర్మూర్ అభివృద్ధి..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సిడీలే రూ.320 కోట్లు వచ్చాయని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 62,000 మందికి రూ.2016, రూ.4016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు. వేల మందికి రైతుబంధు (Raithu bandhu) ద్వారా పెట్టుబడి సాయం అందుతోందని వివరించారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించామని వెల్లడించారు. సిద్ధులగుట్టకు రూ. 20కోట్లతో ఘాట్ రోడ్డు వేయించానని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయించామన్నారు. సిద్ధులగుట్టను అద్భుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చిదిద్దానని వెల్లడించారు.
Jeevan Reddy | నిజామాబాద్, నిర్మల్‌కు మధ్య వంతెన..
నిజామాబాద్-నిర్మల్ (Nirmal) జిల్లాల మధ్య రూ.120 కోట్లతో పంచగూడ వంతెనను బీఆర్ఎస్ హయాంలో కట్టించానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించానని.. ఆర్మూర్-నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్‌కు రోడ్లు నిర్మించామని జీవన్ రెడ్డి వివరించారు. 20నెలల్లోనే ఆర్మూర్‌ను అంధకారం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీది అవినీతి, బీజేపీది దుర్నీతి..
కాంగ్రెస్ పార్టీది అవినీతి.. బీజేపీ ది దూర్నీతి అని ప్రజల బాధలు పట్టని బీజేపీ ఎమ్మెల్యే.. ఆర్మూర్‌కు శాపంగా మారాడని జీవన్‌రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం గిట్టని అధికార కాంగ్రెస్ నేతలు అవినీతి భూతాలుగా మారారన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైసా తేలేని దద్దమ్మలు కాంగ్రెస్, బీజేపీల నాయకులని దుయ్యబట్టారు.
Jeevan Reddy | బీజేపీకి వేసిన ఓటు ఆర్మూర్ ప్రగతికి చేటు..
అభివృద్ధి, సంక్షేమం గిట్టని బీజేపీ, కాంగ్రెస్‌లకు ఆర్మూర్‌లో చోటులేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి తప్ప అభివృద్ధి పట్టని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డిల ఆగడాలను ప్రజలు భరించే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ను మట్టికరిపించడమే ధ్యేయంగా పోరాడుతానన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేంతవరకు తగ్గేదేలేదని ఆయన స్పష్టం చేశారు.