అక్షరటుడే, ఇందూరు: Yuva Pro Kabaddi League | తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (Telangana Kabaddi Association) సహకారంతో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 హైదరాబాద్లో యువ ప్రోకబడ్డీ లీగ్ ఛాంపియన్షిప్ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులతో 8 జట్లను ఎంపిక చేశారు. కాగా ‘శాతవాహన సైనిక’ జట్టుకు (Satavahana Sainika team) చీఫ్ కోచ్గా జిల్లాకు చెందిన కబడ్డీ శిక్షకుడు ప్రశాంత్ (Kabaddi Prashanth) నియామకమయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో (District Sports Authority) కబడ్డీ కోచ్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ సంఘం (Nizamabad Kabaddi Association) అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్ రెడ్డి, కోశాధికారి సురేందర్, ఉపాధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, సీనియర్ క్రీడాకారులు, పీఈటీలు రాజ్ కుమార్, గంగారెడ్డి, శ్రీనివాస్, హైదర్ అలీ, హరిచరణ్, అనురాధ, జ్యోతి తదితరులు అభినందించారు.