అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NHAI Notification | పలు పోస్టుల భర్తీ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 44
పోస్టుల వివరాలు : యంగ్ ప్రొఫెషనల్(లీగల్)
విద్యార్థత : గుర్తింపు పొందిన యూనివర్సిటీనుంచి లా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి : ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నాటికి 32 ఏళ్లు దాటనివారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన శ్రేణి : నెలకు రూ. 60 వేలనుంచి రూ. 65 వేలు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 10.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు https://nhai.gov.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.