అక్షరటుడే, కోటగిరి: Pocharam Bhaskar Reddy | మీడియా (Media) లేనిదే ప్రపంచం లేదని ఉమ్మడి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కోటగిరి (Kotagiri), పోతంగల్ (Pothangal) ఉమ్మడి ప్రెస్‌క్లబ్ (Press club) కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ చోట ఏం జరిగినా క్షణాల్లో మీడియా ద్వారా తెలిసిపోతుందన్నారు. వార్తలను ప్రజలు చేరువ చేయడంలో మీడియా పాత్ర విశేషమని.. అలాంటి మీడియాను ప్రతిఒక్కరూ గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో వార్తాపత్రికలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం యూట్యూబ్ ఛానళ్లు (YouTube channels) కూడా వచ్చాయన్నారు.
Pocharam Bhaskar Reddy | ప్రెస్‌క్లబ్ సేవలను ప్రశంసనీయం..
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పోచారం భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులు సైతం విలువలను కాపాడుతూ.. ప్రజలకు విలువైన సమాచారాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) విలేకరులకు ఎక్కువ సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిదేనని (Mla Pocharam Srinivas Reddy)పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ గంగాధర్, ఏఎంసీ ఛైర్మన్ హన్మంత్, విండో ఛైర్మన్ కూచి సిద్దు, ఎస్సై సునీల్, అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షుడు పుల్కంటి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీకాంత్, సెక్రెటరీ అనిల్, గౌరవ అధ్యక్షులు రాము, కోశాధికారి అనిల్, సలహాదారులు సాయిలు, ముఖ్య సలహాదారులు గోగినేని హన్మంత్ రావు, రాములు, కార్యవర్గసభ్యులు ఏజాజ్ ఖాన్, జుబేర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.