అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండడంతో అధికారులు మంజీర పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.
Nizamsagar Project | ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం..
రాబోయే 24 గంటల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయని తహశీల్దార్ భిక్షపతి (Tahsildar Bikshapathi), నీటిపారుదల శాఖ (Irrigation Department) ఏఈలు అక్షయ్ కుమార్, సాకేత్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో చూసిన అనంతరం వారు వివరాలు వెల్లడించారు.
Nizamsagar Project | జాలర్లు, గొర్రెల కాపర్లకు అలర్ట్..
ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీర (manjeera) పరీవాహక ప్రాంతంలో చేపలు పట్టేవాళ్లు, గొర్రెల కాపర్లు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి ఉధృతి ఉంటుంది. కావున పరీవాహక ప్రాంతాలవైపు వెళ్లవద్దని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.8 టీఎంసీలకు గాను 10.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగూరుకు భారీగా వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.