అక్షరటుడే, నిజాంసాగర్: Annabav Sate | ప్రజలంతా అన్నాబావు సాటే చూపిన బాటలో నడవాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Mla Laxmi Kantha Rao) పేర్కొన్నారు. సాహిత్యరత్న లోక షాహీర్ అన్నాబావు సాటే 105వ జయంతి సందర్భంగా జుక్కల్ (jukkal) మండలం హంగర్గా (Hungarga) గ్రామంలో సాటే విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అన్నాబావు సాటే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు (Rakhi) కట్టి హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును సన్మానిస్తున్న హంగర్గవాసులు