అక్షరటుడే, కామారెడ్డి: SPR School | జిల్లా కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాల ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC Results) సత్తా చాటింది. పాఠశాలలో విద్యార్థిని అన్షిత 596, గాయత్రి, శ్రేణిత 590 మార్కులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ కొమిరెడ్డి మారుతి తెలిపారు. పాఠశాలలో 148 మంది విద్యార్థులకు గాను 125 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.