అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jr NTR | టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై (jr NTR) టీడీపీకి చెందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (MLA Daggubati Venkateswara Prasad) చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉన్న ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా (War 2 Movie) విడుదల సందర్భంగా అభిమానుల సమాఖ్య నేత ధనుంజయ నాయుడు, ఎమ్మెల్యే దగ్గుపాటిని ఆహ్వానిం చేందుకు వెళ్లగా, ఆ సమయంలో ఈ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంభాషణలో, ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ను దూషిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
jr NTR | తిట్ల వర్షం..
ఆ ఆడియోలో ఎమ్మెల్యే ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్‌కు (Nara Lokesh) వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అతని సినిమాలను అనంతపురంలో ప్రదర్శించనివ్వబోమని, ‘వార్ 2’ ప్రత్యేక షోలను నిలిపివేయాలన్న హెచ్చరించినట్టు వినిపిస్తుంది. ఈ ఆడియో బయటకు వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు (Jr Ntr Fans) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు సోషల్ మీడియాలో “జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించే హక్కు ఎవరికీ లేదు”, “ఇది అభిమానుల మనోభావాలను దెబ్బతీసే చర్య” అంటూ పెద్దఎత్తున పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. టీడీపీ శ్రేణుల్లోనూ ఒక వర్గం ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరొక వర్గం మౌనంగా ఉండడం గమనార్హం.
ఈ వివాదంపై ఇప్పటివరకు టీడీపీ అధిష్టానం కానీ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (MLA Daggupati Prasad) కానీ అధికారికంగా స్పందించలేదు. తాజా ఘటనపై రాజకీయ వర్గాలు, సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు స్పందించే అవకాశముంది. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ పార్టీకి నష్టం కలిగించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దీనిపై స్పందిస్తారా? టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది చూడాలి. కాగా, ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఈ మూవీ అనుకున్నంత విజయం అందుకోలేకపోయింది.