అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajasthan | ప్రియురాలితో కలిసి జీవించేందుకు కట్టుకున్న భార్యనే (Wife) అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని (Rajasthan) అజ్మీర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ నాయకుడు రోహిత్ సైనీ (BJP Leader Rohith Saini) అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రోహిత్ సైనీకి కొన్నేళ్ల క్రితమే సంజు అనే మహిళతో వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన రీతూ సైనీ అనే మహిళతో అతనికి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య సంజు తన బంధానికి అడ్డుగా ఉందని భావించిన రోహిత్, ఆమెను దారుణంగా హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.
Rajasthan | దోపిడీ నాటకంతో తప్పించుకోవాలని..
ఈ నెల 10న సంజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వెంటనే పోలీసులకు (Police) సమాచారం అందించాడు . రోహిత్ తన భార్యను చంపింది దొంగలు అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇంట్లోకి దొంగలు చొరబడి విలువైన వస్తువులతో పాటు భార్యను హతమార్చారంటూ చెప్పాడు. కానీ అతని సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. “పోలీసుల దర్యాప్తులో రోహిత్ ఒత్తిడికిలోనై నేరాన్ని అంగీకరించాడు. అతని ప్రియురాలు రీతూ సైనీ (Lover Reethu Saini) సూచనతోనే సంజును హత్య చేశాడని తెలిపాడు. ఆమె ఒత్తిడి చేయడమే ఈ హత్యకు కారణమైంది. 24 గంటల్లో కేసు ఛేదించి ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు వెనుక మరెవరైనా ఉన్నారా? మరో కుట్ర ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు (Police Investigation) జరుపుతున్నారు. ఒక సంబంధం.. ఒక కుట్ర.. ఒక హత్య..ఈ సంఘటన రాజకీయ (Politics) వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది. ప్రజా సేవకుడిగా Leader నడుం బిగించాల్సిన నాయకుడు, వ్యక్తిగత స్వార్థం కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.