అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | పోచారం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాంధారి, తాడ్వాయి, గుండారం వాగుల ద్వారా నాలుగు వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చింది.
పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడంతో పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. ప్రధాన కాలువ ద్వారా పంటల నిమిత్తం 120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 4,000 క్యూసెక్కుల నీరు అలుగు ద్వారా మంజీరలోకి వెళ్తోంది.
Pocharam Project | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ప్రాజెక్టును ఆర్డీవో పార్థసింహారెడ్డి(RDO Parthasimha Reddy), డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas), డీఈ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. లోలెవెల్ వంతెనల (Lowlevel Bridge) వద్ద ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోచారం అలుగుపై పడుతున్న వరదనీరు చూపరులను ఆకట్టుకుంటోంది.
కళ్యాణి ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి నీటి విడుదల
కళ్యాణి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి 200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నిజాంసాగర్ ప్రధాన కాలువకు 60 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. అలాగే 150 క్యూసెక్కుల వరద నీటిని మంజీరలోకి వదులుతున్నారు. ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
కళ్యాణి ప్రాజెక్టు