అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం ఉదయం నాటికి 1405.00 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1399.46 అడుగుల (10.79టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 45,000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తోంది.
Nizamsagar Project | సింగూరు ఐదు గేట్లు ఎత్తివేత..
నిజాంసాగర్ ఎగువ భాగంలో మంజీర (Manjeera) పరీవాహక ప్రాంతంలో ఉన్న సింగూరు ప్రాజెక్టులోకి (Singur Project) ఎగువ భాగం నుంచి 32,766 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 5 వరద గేట్ల ద్వారా 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి సింగూరు ప్రాజెక్టులో 523.60 మీటర్లకు గాను (29.917 టీఎంసీలు) గాను 521.79 20.91 మీటర్ల మేర (20.910 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు ఏఈలు సాకేత్, అక్షయ్ కుమార్ తెలిపారు.
సింగూరు ఐదుగేట్లను ఎత్తి దిగువకు వరదనీటిని వదులుతున్న దృశ్యం