అక్షరటుడే, వెబ్‌డెస్క్: t20i series : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ Maxwell వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 2023 ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడైన మ్యాక్స్‌వెల్ కొద్ది రోజుల క్రితం వన్డేలకి గుడ్ బై చెబుతూ టీ20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నట్టు చెప్పాడు. అయితే తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ వీరవిహరం చేసి ఓడే మ్యాచ్‌ని గెలిపించి తనలో సత్తా చావలేదని నిరూపించాడు.సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆసీస్‌ను గెలిపించాడు.
t20i series : అదరగొట్టే బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్‌గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది.బ్రెవిస్ 26 బంతుల్లో 53 (1 ఫోర్, 6 సిక్స్‌లు), వాన్ డెర్ డస్సెన్ 38 నాటౌట్ (26 బంతుల్లో 3 ఫోర్లు), స్టబ్స్ 25 (23 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేశారు. ఆసీస్ బౌలింగ్ చూస్తే.. నాథన్ ఎల్లిస్ 3/31, హజెల్‌వుడ్ 2/30, ఆడమ్ జంపా 2/24 అద్భుతమైన బౌలింగ్‌తో సౌతాఫ్రికాని South Africa కట్టడి చేశారు. ఇక చేజింగ్‌లో ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ 54 (37 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ 62 నాటౌట్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్స్‌లో కోర్బిన్ బోచ్ 3/26, కగిసో రబడా 2/32, క్వెన్ మఫకా 2/36తో రాణించారు.
అయితే చివరి ఓవర్ ఉత్కంఠభరితంగా మారింది. విజయానికి చివరి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమవగా, కోర్బిన్ బోచ్ 19వ ఓవర్లో రెండు వికెట్లు తీసి కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో ఆసీస్‌కు ఇంకా 10 పరుగుల అవసరం ఉండగా, మ్యాక్స్‌వెల్ ఆ ఒత్తిడిని జయించాడు. లుంగి ఎంగిడి Ngidi వేసిన 20వ ఓవర్ లో 1వ బంతికి 2 పరుగులు రాగా, 2వ బంతి ఫోర్, 3,4 డాట్, 5వ బంతికి ఫోర్ కొట్టడంతో ఆసీస్ విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ మ్యాచ్‌కు ముగింపు పలుకుతూ, అభిమానులకు అలుపెరిగని ఉత్సాహాన్ని అందించింది.