ePaper
More
    Homeబిజినెస్​Gold rates on august 17 | మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి...

    Gold rates on august 17 | మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  Gold rates on august 17 : భారతదేశంలో బంగారానికి Gold ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడికి ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉంది.

    పండుగలు, శుభకార్యాలు, ముఖ్యంగా పెళ్లిళ్లు వంటి సందర్భాల్లో బంగారం కొనుగోలు సంప్రదాయంగా మారిపోయింది.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నందున బంగారం డిమాండ్ కూడా భారీగా పెరిగింది. అయితే ఇటీవల అమెరికా విధించిన సుంకాలు, అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలు వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

    Gold rates on august 17 : మంచి అవ‌కాశం..

    తులం ధర లక్ష రూపాయల మార్క్ దాటడం వల్ల చాలామంది కొనుగోలుదారులు వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడే వారికి మంచి అవకాశం.

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ Trump సుంకాలు తగ్గించే సూచనలు చేయడం, ప్రపంచంలో యుద్ధ ఉద్రిక్తతలు తక్కువవడం వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు త‌గ్గుతూ వస్తున్నాయి.

    ఆగస్టు 17 బంగారం ధ‌ర‌లు చూస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులానికి రూ.60 తగ్గి రూ. 1,01,180కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులానికి రూ.50 తగ్గి రూ. 92,750 గా ఉంది.

    దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో చూస్తే..

    • ముంబైMumbaiలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,180 కాగా , 22 క్యారెట్ల ధర రూ.92,750 గా ట్రేడ్ అయింది.
    • చెన్నైChennaiలో 24 క్యారెట్ల ధర రూ. 1,01,180 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 92,750గా ట్రేడ్ అయింది.
    • బెంగళూరుbengaluruలో 24 క్యారెట్ల ధర రూ. 1,01,180 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 92,750 గా న‌మోదైంది.
    • హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ. 1,01,180 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ. 92,750గా ట్రేడ్ అయింది.
    • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,01,180, 22 క్యారెట్ల ధర రూ. 92,750 లుగా న‌మోదైంది.

    వెండి ధరల విషయానికొస్తే..హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ. 1,26,200కి చేరింది.ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో మాత్రం కిలో వెండి ధర రూ. 1,16,200 వద్ద కొనసాగుతోంది.

    Latest articles

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    Jeevan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గులాబీ జెండా ఎగరేస్తామని...

    Teenmar Mallanna | బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ ఆడుతున్న నాటకం..: తీన్మార్​ మల్లన్న

    అక్షరటుడే, ఇందూరు: Teenmar Mallanna | బీసీలకు రిజర్వేషన్ల పేరుతో (BC Reservations) కాంగ్రెస్​ నాటకమాడుతోందని ఎమ్మెల్సీ తీన్మార్...

    More like this