అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్ (NIZAMABAD) జిల్లా డిచ్పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC Medical College), హాస్పిటల్‌ను పున:ప్రారంభించి మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకుంటామని మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్ దయానంద్ Medical Board Convenor Dayanand తెలిపారు.
మొదట ఆసుపత్రి అందుబాటులోకి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీఎంసీపై గతంలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. మెడికల్ కళాశాల స్థానికుల సౌకర్యార్థం గతంలో ఇక్కడ ప్రారంభించి సేవలు అందించిందని గుర్తుచేశారు. కొన్ని అనివార్య కార్యాల వల్ల మూతపడిందన్నారు. దానిని పునఃప్రారంభిస్తామన్నారు.
ముందుగా హాస్పిటల్ నిర్వహణ కోసం డాక్టర్ అజ్జ శ్రీనివాస్ బృందం వస్తుందన్నారు. మొదట హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తర్వాత 2025 –26 అకాడమిక్ ఇయర్లో academic year మెడికల్ నర్సింగ్ కాలేజ్‌ను ప్రారంభిస్తామన్నారు.
వచ్చే అకాడమీ ఇయర్లో మెడికల్ కళాశాలను పూర్తిస్థాయి, అనుమతులతో ప్రారంభించుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ సీఎస్ఐ మెదక్ డయాసిస్ బాధ్యత అని పేర్కొన్నారు.
డాక్టర్ అజ్జ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎస్ఐ మెదక్ డయాసిస్ పర్యవేక్షణలో హాస్పిటల్ నిర్వహణ ఉంటుందన్నారు. ఆయన వెంట బోర్డు మెంబర్లు ప్రసాద్, రావుల సాంసన్, పాస్టర్ రవరెంట్ ఏసు కుమార్, మెట్టు సాంసంన్, డాక్టర్ అజ్జ శ్రీనివాస్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ సుమన్, సీఎంసీ సభ్యులు తదితరులున్నారు.